Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentTamannah Bhatia | అమ్మో ! తమన్నా సినిమాల్లోకి వచ్చి అన్ని కోట్లు సంపాదించిందా?

Tamannah Bhatia | అమ్మో ! తమన్నా సినిమాల్లోకి వచ్చి అన్ని కోట్లు సంపాదించిందా?

Tamannah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. విజయ్‌ వర్మతో డేటింగ్‌ వార్తలు బయటకొచ్చాక ఈమెపై అందరి ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే తమన్నాకు ఎంత ఆస్తి ఉంది? సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎంత సంపాదించింది? వంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి.

తమన్నా 2005లో శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. 2007లో హ్యాపీడేస్‌ సినిమాతో ఫస్ట్‌ సక్సెస్‌ అందుకుంది. దాదాపు 17 ఏళ్ల సినీ కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఇప్పటికీ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా కొనసాగుతోంది. పలు శారీ షోరూంస్‌తో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్‌కాన్‌ మొబైల్స్‌, చంద్రికా ఆయుర్వేదిక్‌ సోప్‌ వంటి పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తుంది. వీటి యాడ్స్‌ ద్వారా తమన్నా ఏడాదికి రూ.12 కోట్లు సంపాదిస్తుందట. అంటే సగటున నెలకు ఒక్క కోటి రూపాయలు అన్నమాట. సినిమాల విషయానికొస్తే ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. స్పెషల్‌ సాంగ్స్‌ అయితే రూ.50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు డిమాండ్‌ చేస్తోంది. 2018 ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో 10 నిమిషాల ప్రదర్శన కోసం దాదాపు 50 లక్షలు తీసుకుంది.

సినిమాలు, ప్రకటనలే కాకుండా బిజినెస్‌లో కూడా తమన్నా సత్తా చాటుతోంది. 2015లో వైట్‌ అండ్‌ గోల్డ్‌ పేరిట ఒక డైమండ్‌ జువెల్లరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈమె వద్ద రూ.2కోట్లు విలువైన అరుదైన వజ్రం కూడా ఉంది. సైరా నరసింహారెడ్డి సినిమా సమయంలో తమన్నాకు మెగా కోడలు ఉపాసన కొణిదెల బహుమతిగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వజ్రం ప్రపంచంలోనే ఐదో పెద్ద డైమండ్‌ అని సమాచారం. దీని బరువు సుమారు 62.4 గ్రాములు ఉంటుంది. ఇవే కాకుండా తమన్నాకు ముంబైలోని వెర్సోవాలో రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్‌ ఉంది. ఆమె గ్యారేజిలో ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, బెంజ్‌ కార్లు ఉన్నాయి. తమన్నా వాడే హ్యాండ్‌ బ్యాగ్‌ ఖరీదు 3 లక్షలు పైమాటే. ఇలా మొత్తంగా ఆమె ఆస్తి విలువ రూ.110 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News