Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentHit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి...

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Hit 2 Ott Release | ప్రైమ్ మెంబర్స్‌కు అమెజాన్ కంపెనీ షాకిచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చిన కొద్ది గంటల్లోనే హిట్ 2 సినిమాను ఓటీటీలో నుంచి తొలగించింది. దీంతో ఏమైంది? అసలు ఎందుకు హిట్ సెకండ్ సినిమాను ఓటీటీలో నుంచి తీసేశారనే విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

హిట్ ఫ్రాంచైజీలో భాగంగా డిసెంబర్ 2న వచ్చిన హిట్ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ తర్వాత అడవి శేష్ నుంచి వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు రూ.14.25 కోట్ల బిజినెస్ జరగ్గా.. ఫుల్ రన్‌లో రూ.22.75 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై.. నెల రోజులు పూర్తవుతుండటంతో హిట్ 2 చిత్రాన్ని జనవరి 6 నుంచి రెంట్ బేస్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తామని అమెజాన్ ప్రకటించింది. కానీ అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ మూడు రోజుల ముందే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది.

దీంతో చాలామంది ఈ సినిమాను చూసేశారు. ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తున్న సమయంలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండానే హిట్ 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నుంచి తొలగించింది. దీంతో ఇంకా సినిమా చూడని ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ఎందుకు తొలగించిందా? అనే అనుమానం మొదలైంది. అయితే కొన్ని పైరసీ సంస్థలు ఇప్పటికే ఈ సినిమాను తమ వెబ్‌సైట్స్‌లో లీక్ చేసేశాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే సినిమాకు ఆదరణ తగ్గే అవకాశం ఉందనే అమెజాన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి ఈ సినిమాను మళ్లీ అమెజాన్ ఓటీటీలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News