Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentMrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు...

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

Mrunal Thakur remuneration | సీతారామం సినిమాతో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. సూపర్ 30, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపును ఒక్క తెలుగు సినిమాతో తెచ్చుకుంది. సీతారామం సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అందరికీ ఫేవరేట్‌గా మారిపోయింది. ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ నటన చూశాక.. ఈమెకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ మృణాల్ మాత్రం తొందరడపకుండా ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఒక విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

విట్టి దండు అనే మరాఠీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. సీతారామం కంటే ముందు బాలీవుడ్‌లో పలు సినిమాల్లోనూ నటించింది. కానీ మృణాల్‌కు అంత క్రేజ్ ఏమీ లేదు. దీంతో సీతారామం సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ మాత్రమే అందింది. ఈ సినిమాలో సీత పాత్ర కోసం రూ.80 లక్షల పారితోషికం తీసుకుంది. కానీ సీతారామం సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాలో తన అందానికి, అభినయానికి అంతా ఫిదా అయ్యారు. దీంతో ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రేజ్ ఇలా ఉండగానే ఎంతో కొంత సంపాదించుకోవాలని మృణాల్ ఠాకూర్ ఫిక్సయిపోయింది. అందుకే సీతారామం తర్వాత తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం నాని 30 సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో నాని భార్యగా నటించేందుకు మృణాల్ ఠాకూర్ రూ. కోటికి పైగానే డిమాండ్ చేసిందట. అయితే ఆ పాత్రకు మృణాల్ అయితేనే న్యాయం చేస్తుందని నాని ఫిక్సయ్యారట. ఇదే విషయం నిర్మాతలకు చెప్పడంతో మృణాల్ ఠాకూర్‌కు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై మృణాల్ ఠాకూర్ మరో సినిమా కూడా చేస్తుంది. ఇలా తన రెమ్యునరేషన్‌ను రెండింతలకు పెంచేసినా సరే వరుస ఆఫర్లు రావడాన్ని బట్టి ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News