Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentNTR for Oscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా...

NTR for Oscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

NTR for Oscars | జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ డైలాగులను గుక్కపెట్టుకోకుండా చెప్పడమే కాదు.. కళ్లతోనే లక్ష ఎమోషన్స్ పండిస్తాడు. అందుకే తారక్ యాక్టింగ్‌కు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. ట్రిపుల్ ఆర్ తర్వాత తెలుగువాళ్లే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఇదే అంటున్నారు. ఏం యాక్టింగ్‌రా బాబూ.. కళ్లతో అన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు అంటూ తారక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. విదేశీ మ్యాగజైన్‌లు సైతం ఎన్టీఆర్ నటనను తెగ పొగిడేస్తున్నాయి. ఈయనకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఫిక్సయిపోతున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్‌లో తారక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపించాడు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్‌లో కళ్లతోనే ఏడిపించేశాడు. పెద్దపులితో ఫైటింగ్ సీన్, ఇంటర్వెల్‌ సీన్స్‌లో రౌద్రాన్ని పలికించాడు. ఒక్క యాక్టర్ ఒక్క సినిమాలోనే ఇన్ని ఎమోషన్స్ పలికించడం చూసి హాలీవుడ్ జనాలు సైతం ఇంప్రెస్ అయిపోయారు. ఇది చూసి ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం ఖాయమని మనవాళ్లు ఫిక్సయిపోయారు. ఎన్టీఆర్‌కు ఆస్కార్ ఇవ్వాలని అప్పట్లో సోషల్ మీడియాలో #NTRforOscars అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మ్యాగజైన్ వెరైటీ.. ఆస్కార్ ప్రిడిక్షన్ యాక్టర్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో టాప్ 10 నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నాడు. దీంతో ఈసారి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అవ్వడం పక్కా అని నందమూరి ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఈ టాపిక్‌ను మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు RRRforOscars, #NTRforOSCARS, #NTRGoesGlobal #ManofMasses హ్యాష్‌ట్యాగ్స్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి.

అవార్డుల పరంగా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా దూసుకెళ్తున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సినిమా అవార్డులను ట్రిపుల్ ఆర్ మూవీ దక్కించుకున్నది. తాజాగా న్యూయార్క్ ఫిల్స్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు కూడా ఈ సినిమాకు వచ్చింది. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళి అవార్డు అందుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News