Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentSamantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Samantha | మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు సమంత చెప్పినప్పటి నుంచి ఆమె ఆరోగ్యపై సాధారణ ఫ్యాన్స్‌ నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఆందోళన చెందారు. ఆమె తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి సమయంలోనే సమంత అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్‌ కొంచెం ఖుషీ అవుతున్నారు. సమంత కూడా ఇప్పుడు తన పని మీద పూర్తిగా ఫోకస్‌ చేస్తోంది. వర్క్‌ మోడ్‌లో మళ్లీ బిజీ అయిపోయింది.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే సమంత కూడా డబ్బింగ్‌ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సమంత.. ఆసక్తికరమైన కొటేషన్‌ రాసుకొచ్చింది. జీవితం ఎలా ఉన్నా.. మనం ఎంత బాధలో ఉన్నా.. ఎంత నష్టపోయినా వాటన్నింటికీ పరిష్కారం ఒక్క కళనే. కళ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం. అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితిని ప్రతిబింబించేలా ఉందని ఫీలవుతున్నారు. ఇక సమంత చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో డబ్బింగ్ స్టూడియోలోని ఒక్క స్క్రీన్‌.. అందులో శాకుంతలం సినిమాలోని సామ్‌ లుక్‌ కనిపించింది. ఇది చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా శాకుంతలం సినిమా రూపొందుతుంది. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. మోహన్‌ బాబు, ప్రకాశ్‌ రాజ్‌, గౌతమి, మధుబాల తదితరులు కీలక పాత్రలో నటించారు. అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా సినీ ఇండస్ట్రీకి తెరంగేట్రం చేస్తుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కానుంది.

Follow Us : Google News, FacebookTwitter

Read more Articles:

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

Vaarasudu Trailer | సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్.. తెలుగులోనూ వచ్చేసింది !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News