Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentSharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Sharwanand | రెబల్ స్టార్ ప్రభాస్‌తో మొదలుపెడితే టాలీవుడ్‌లో పెళ్లి కాని కుర్ర హీరోలు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఉంటాడు. ఇప్పటికే 38 ఏళ్ల వయసుకు వచ్చిన శర్వానంద్‌ను చూసి ఇంకా పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అన్‌స్టాపబుల్ షోకి వెళ్తే కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి శర్వానంద్ ఆ మ్యాటర్ దాటవేశాడు. కానీ ఇప్పుడు శర్వానంద్‌కు పెళ్లి ఫిక్సయినట్లుగా ఫిలింవర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

తెలంగాణకు చెందిన ఓ అమ్మాయితో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శర్వానంద్ ప్రేమించిన అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉంటుందట. ఆ అమ్మాయితో శర్వానంద్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అమ్మాయిది రెడ్డి సామాజిక వర్గమని తెలుస్తోంది. వధువు గురించి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది.

sharwanand1

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే.. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్ వంటి చిత్రాలతో తన స్టార్‌డమ్ పెంచుకుని కమర్షియల్ హీరోగా ఎదిగాడు. శతమానం భవతి సినిమా తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొంటున్న శర్వా.. రీసెంట్‌గా ఒకే ఒక జీవితం సినిమా హిట్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Tamanna Bhatia | నాని విలన్‌తో ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ .. బీ టౌన్‌లో న్యూస్‌ వైరల్‌.. సీరియస్ అవుతున్న తమన్నా ఫ్యాన్స్‌

Punarnavi | ఆ వ్యాధితో న్యూ ఇయర్ ప్రారంభిస్తున్నా.. ఎమోషన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News