Home Entertainment Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం...

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Karthika Deepam | కార్తీక దీపం సీరియల్‌తో తెలుగింటి ఆడపడుచులకు వంటలక్క ఎంత బాగా తెలుసో.. మోనిత కూడా అంతేమందికి తెలుసు. డాక్టర్‌ బాబును తనవాడిని చేసుకోవాలని కుట్రలు పన్నుతూ దీపను అష్టకష్టాలు పెట్టే మోనితను చూస్తే చంపేయాలి అనేంత కోపం వస్తుంది. కార్తీక దీపం సీరియల్‌లో నెగెటివ్‌ క్యారెక్టర్‌తో అంతలా పేరు తెచ్చుకున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఇన్ని రోజులు సీరియల్‌లో డాక్టర్‌ బాబు వెంటపడిన శోభా శెట్టి.. ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వబోతుంది. ఈ విషయాన్ని శోభా శెట్టినే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

తనకు తెలియకుండానే వాళ్ల అమ్మ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందని శోభా శెట్టి ఆ వీడియోలో తెలిపింది. ఆ అబ్బాయెవరో కూడా ఇంతవరకు తనకు తెలియదని చెప్పింది. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికి సిగ్గుగా ఉందని.. ఫస్ట్‌ టైమ్‌ సిగ్గుపడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే అని మురిసిపోయింది. సోమవారం ( జనవరి 23 న ) తన పుట్టిన రోజు అని.. ప్రతి ఏడాది ఈ రోజున ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటామని తెలిపింది. అయితే ఈసారి బర్త్‌ డేకి మాత్రం వాళ్ల అమ్మ సర్‌ప్రైజ్‌ ఇచ్చిందని పేర్కొంది. తనకు తెలియకుండానే ఒక అబ్బాయిని చూసిందని చెప్పింది. అతను తనను చూడ్డానికి ఇంటికి వస్తున్నాడని.. అందుకే రెడీ అవుతున్నానంటూ వీడియోలో చెప్పుకుంటూ తెగ సిగ్గుపడిపోయింది.

పెళ్లి చూపులకు ముస్తాబైన తర్వాత ఎలా ఉందో కూడా వీడియోలో చూపించింది. ఆరెంజ్‌ కలర్‌ పట్టుచీర కట్టుకుని అందంగా ముస్తాబు అయితే అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శోభాకి కాబోయే వాడిని చూడాలని ఇంట్రెస్ట్‌ చూపించారు. ఒకవైపు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూనే.. మరోవైపు అతని గురించి వివరాలు చెప్పాలంటూ కామెంట్ల పెడుతున్నారు. మరి ఇంకో వీడియోలో అయిన తనకు కాబోయే భర్తను మోనిత ( శోభా శెట్టి ) పరిచయం చేస్తుందో లేదో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారు?

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Exit mobile version