Home Entertainment Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ...

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Jeremy Renner | మొన్నటిదాకా అమెరికాను వణికించిన బాంబ్ స్లైక్లోన్‌ ( Bomb Cyclone ) అవెంజర్స్‌ ( Avengers ) ఫేమ్‌ మార్వెల్‌ ( Marvel ) సూపర్‌ హీరో జెరెమీ రెన్నర్‌ కుటుంబాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కొత్త సంవత్సరం వేళ ఇంటి ముందు పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో జెరెమీ రెన్నర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుందామని ప్లాన్‌ చేసుకున్న జెరెమీ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన జెరెమీ రెన్నర్‌.. ప్రమాదం గురించి వివరాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటున్న జెరెమీ రెన్నర్‌ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ విషాద సంఘటన నుంచి తొందరగా కోలుకోవడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చాడు. న్యూ ఇయర్‌ రోజు మంచు గడ్డల కింద నలిగిపోయానని.. ఈ ప్రమాదంతో తన 30 ఎముకలు విరిగిపోయాయని వెల్లడించారు. కొత్త ఏడాదిలో రిజల్యూషన్స్‌ అన్నీ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నానని.. కానీ తన కుటుంబమంతా విషాదంలోకి వెళ్లిందని చెప్పుకొచ్చాడు. అభిమానుల ప్రేమ వల్లే తొందరగా కోలుకున్నానని తెలిపారు. మీ అందరి ప్రేమ ఇలాగే ఉంటే మరింత బలంగా, ఆరోగ్యంగా మారి మీ ముందుకొస్తానంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జెరెమీ రెన్నర్‌ చేసిన పోస్టుకు విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. సెలబ్రెటీలు, ఫ్యాన్స్‌ అంతా ఆయన తొందరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

1995లో హాలీవుడ్ సినిమాలకు ఎంట్రీ ఇచ్చాడు జెరెమీ రెన్నారు. రెండుసార్లు ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ది హార్ట్‌ లాకర్‌ సినిమాకు ఉత్తమ నటుడిగా.. ది టౌన్‌ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. ఈ సినిమాలతో వచ్చిన గుర్తింపుతో మార్వెల్‌ సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకున్నాడు. ముందుగా 2011లో వచ్చిన థార్‌ సినిమాలో తొలిసారిగా సూపర్‌ హీరో హాక్‌ ఐగా కనిపించాడు. ఆ తదుపరి ఏడాదే అవెంజర్స్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవెంజర్స్‌ సూపర్‌ హీరోల్లో హాక్‌ ఐగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈయనకు ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. అవెంజర్స్‌ సిరీస్‌ అయిపోవడంతో హాక్‌ ఐ పేరిట ప్రత్యేక వెబ్‌ సిరీస్‌ను కూడా నిర్మించారు. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

Wrestlers Protest | డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి నుంచి ప్రాణహాని ఉందన్న యువ రెజ్లర్లు.. కమిటీ ఏర్పాటు చేసిన భారత ఒలింపిక్‌ సంఘం

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం.. క్వార్టర్స్‌ చేరాలంటే క్రాస్‌ ఓవర్‌ తప్పనిసరి.

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Exit mobile version