Home Entertainment Sreeleela | హైదరాబాద్‌లో సినిమా టికెట్లు అమ్మిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల

Sreeleela | హైదరాబాద్‌లో సినిమా టికెట్లు అమ్మిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల

Sreeleela | పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌లో పిల్ల భలేగుంది అనిపించుకుంది శ్రీలీల. తాజాగా మాస్‌ మహారాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 23 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో శ్రీలీల చేసిన ఓ పని ఆశ్చర్యానికి గురిచేసింది.

ధమాకా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌కు వెళ్లింది శ్రీలీల. అక్కడ కాసేపు అభిమానులతో సందడి చేసింది. వారితో కలిసి డ్యాన్సులు వేసింది. అనంతరం టికెట్‌ కౌంటర్‌లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మింది. బ్యూటిఫుల్‌ హీరోయిన్ టికెట్లు అమ్మడంతో శ్రీలీల కుర్రకారు కౌంటర్‌ వద్ద క్యూకట్టింది. కాసేపు టికెట్లు అమ్మిన తర్వాత ఫ్యాన్స్‌తో కలిసి డ్యాన్సులు చేసింది. వారితో సరదాగా గడిపింది. దీంతో శ్రీలీలతో ఫొటోలు దిగేందుకు కుర్రకారు ఎగబడ్డారు. దీనికి సంబంధించి అభిమానులు తీసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రవితేజ డ్యుయెల్‌ రోల్‌లో వస్తున్న ధమాకా సినిమా వచ్చే వారం థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. రవితేజకు ఈసారి హిట్‌ పక్కా అని అనుకుంటున్నారు. ఇక శ్రీలీల విషయానికొస్తే యంగ్‌ హీరోలు చాలామందికి ఫస్ట్‌ చాయిస్‌గా మారింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. అనిల్‌ రావిపూడి చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటిస్తుంది. అది కాకుండా అనగనగ ఒక రాజు చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రలోనూ శ్రీలీలనే ఎంపిక చేసుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Exit mobile version