Home Entertainment Manchu Manoj | భూమా మౌనికతో పెళ్లిపై రేపు క్లారిటీ రానుందా.. మంచు మనోజ్...

Manchu Manoj | భూమా మౌనికతో పెళ్లిపై రేపు క్లారిటీ రానుందా.. మంచు మనోజ్ ఏం గుడ్ న్యూస్ చెబుతాడో..!

Manchu Manoj | మంచు మనోజ్ రెండో పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్.. రెండో పెళ్లి టాపిక్‌తో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికతో మంచు మనోజ్ రిలేషన్‌లో ఉన్నాడని.. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంచు మనోజ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నా మనసుకు చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను చాలా రోజులుగా నాలోనే దాచిపెట్టుకున్నా. నా జీవితంలో కొత్త స్టేజికి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటిలాగే మీ అందరి ఆశీస్సులు కావాలి. అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. దీనికి దొంగ దొంగది సినిమాలోని మన్మథ రాజా.. మన్మథ రాజా సాంగ్‌ను యాడ్ చేశాడు. దీన్ని చూసిన అభిమానులు.. భూమా మౌనికతో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం ప్రకటిస్తాడని భావిస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రణతి రెడ్డిని 2015లో మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో 2019లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించేశాడు. మధ్యలో అహం బ్రహ్మస్మి అనే సినిమాను ప్రకటించినప్పటికీ.. దాని గురించి ఇంతవరకు అప్‌డేట్ లేదు. ఆ సినిమాను పక్కన పెట్టేశారు అనే టాక్ కూడా నడుస్తోంది. ఇలాంటి సమయంలో మంచు మనోజ్.. భూమా మౌనికతో పెళ్లి విషయమే ప్రకటిస్తాడా? లేదా చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడా? అని కూడా ఫ్యాన్స్ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచి మనోజ్ ఏ గుడ్ న్యూస్ చెబుతాడో చూడాలి మరి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Exit mobile version