Home Entertainment Kaikala satyanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Kaikala satyanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Kaikala satayanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరువక ముందే.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శనివారం కైకాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో జన్మించాడు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే కైకాల ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సమయంలో కైకాల ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ.. 1959లో సిపాయి కూతురు సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా తొలి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్న కైకాల.. పౌరాణికం, జానపద చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించారు.

తన 60 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో కైకాల నటించాడు. ముఖ్యంగా యమగోల సినిమాలో యముడి పాత్ర ప్రేక్షకులకు చిరస్థాయిలో గుర్తుండిపోతుంది. ఇప్పటికీ యముడు అంటే కైకాలను తప్ప ఎవర్నీ ఊహించుకులేరు. యముడిగా అంతగా తన మార్క్‌ను చూపించాడు. చివరగా 2019లో వచ్చిన మహర్షి సినిమాలో నటించాడు. ఆ తర్వాత వయోభారం కారణంగా పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ కైకాల తనదైన ముద్ర వేశాడు. లోక్‌సభ ఎంపీగా సేవలందించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Omicron BF.7 | కరోనా విషయంలో కర్ణాటక సర్కారు కఠిన ఆంక్షలు.. ఎక్కడికెళ్లినా తప్పనిసరిగా పాటించాల్సిందే!

Pooja Hegde | డబ్బుల కోసమే సినిమాల్లోకి రాలేదు.. తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Exit mobile version