Home Entertainment Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Kaikala Satyanarayana | హీరో అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చిన కైకాల సత్యనారాయణ కోరిక నెరవేరలేదు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో డైరెక్టర్ విఠలాచార్య సూచన మేరకు విలన్‌ పాత్రలు చేశాడు. ఇండస్ట్రీలో తిరుగులేని విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కెరీర్‌లో సోలో హీరోగా ఒక్క హిట్ అయినా కొట్టలేకపోయానే అన్న బాధ మాత్రం ఉండేది.తన కోరిక తీరకపోతుందా అని ఎదురుచూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అదే టైమ్‌లో మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన సెక్రటరీ సినిమా రిలీజై ఘన విజయం సాధించింది. ఆ సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో రామానాయుడు ఏదో మాటవరసరకు మంచి కథ దొరికితే కైకాలను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఈ న్యూస్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో సోలో హీరోగా సినిమా చేయాలన్న కైకాల కోరిక మళ్లీ చిగురించింది.

ఇంచుమించు అదే టైమ్‌లో సావాసగాళ్లు చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కమెడియన్ నగేశ్ ఉత్సాహం చూపించడం చూసిన రామానాయుడు.. ఏదైనా స్టోరీ ఉంటే చూద్దాంలే అని పైపైన మాట ఇచ్చేశాడు. కానీ దాన్ని సీరియస్‌గా తీసుకున్న నగేశ్.. నిజంగానే కథ రాసుకొని వచ్చి రామానాయుడు ముందు నిల్చున్నాడు. సినిమా తీయమని ఇటు నగేశ్, అటు కైకాల నుంచి పోరు పెరిగింది. దీంతో వీళ్ల కాంబినేషన్‌లో మొరటోడు అనే సినిమాను ప్రకటించాడు. హీరోయిన్‌గా జయసుధను ఫిక్స్ చేశారు. మోహన్ బాబు, రావు గోపాల్‌రావు, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు వంటి భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. కానీ విలన్‌గా ముద్ర వేసుకున్న కైకాల హీరో ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.

చాలామంది నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఇచ్చిన మాట కోసం రామానాయుడు వెనుకడుగు వేయలేదు. భారీ తారాగణంతోనే మొరటోడు సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోసం అప్పట్లోనే దాదాపు 5 లక్షల బడ్జెట్ పెట్టాడు. 1977 డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. కైకాల సత్యనారాయణను విలన్‌గా చూడటం అలవాటైన ప్రేక్షకులు హీరోగా చూసేందుకు ఇష్టపడలేదు. నగేశ్ అనుభవలేమితో అవుట్‌పుట్ కూడా సరిగ్గా రాలేదు. దీంతో స్టోరీ బాగున్నప్పటికీ..దారుణంగా ఫెయిలయ్యింది. అలా కైకాల కోరిక.. నగేశ్‌కు ఇచ్చిన మాట కారణంగా రామానాయుడికి నష్టం తప్పలేదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala satayanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Exit mobile version