Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentFlora Saini | ఆ నిర్మాత 14 నెలలు నాకు నరకం చూపించాడు.. వెంకీ హీరోయిన్‌...

Flora Saini | ఆ నిర్మాత 14 నెలలు నాకు నరకం చూపించాడు.. వెంకీ హీరోయిన్‌ ఆవేదన

Flora Saini | మీకు ఫ్లోరా సైనీ గుర్తుందా? అదేనండీ ఆశా సైనీ.. మనసున్న మారాజు, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్‌ వంటి సినిమాల్లో నటించింది. అప్పట్లో చాలా తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మాయికి అంతగా పేరు రాలేదు. దీంతో పేరు మార్చుకుని బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. ఓ నిర్మాత 14 నెలల పాటు తనకు నరకం చూపించాడని.. అత్యంత దారుణంగా హింసించాడని సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వెల్లగక్కింది.

‘ కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ప్రేమలో పడ్డా. అతను ఫేమస్‌ ప్రొడ్యూసర్. అతనితోనే నా జీవితం అనుకున్నా. కానీ పరిస్థితులు చాలా తొందరగా మారిపోయాయి. అతను నాతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. నా ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ప్రైవేటు భాగాలపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. నా దగ్గర నుంచి ఫోన్‌ లాక్కున్నాడు. సినిమాలు మానేయాలని ఒత్తిడి చేశాడు. 14 నెలల పాటు ఎవరితో మాట్లాడనివ్వలేదు. కానీ ఒకరోజు సాయంత్రం నా కడుపుపై కూడా తన్నాడు. ఆ తర్వాత ఎలాగోలా పారిపోయి మా అమ్మానాన్నల దగ్గరకు వచ్చేశా. ఇక్కడ కోలువడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్లీ తిరిగి నా ప్రపంచంలోకి వచ్చేశా. యాక్టింగ్‌పై ఫోకస్‌ పెట్టా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా.’ అంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో చీకట్లు ఆవహించిన.. ప్రతిసారి ఓ వెలుగును కనుక్కుంటూ ముందుకు వెళ్తున్నా అంటూ వేదాంతం చెప్పింది.

1999లో వచ్చిన ప్రేమ కోసం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఫ్లోరా సైనీ. ఆ తర్వాత అంతా మన మంచికే, చాలా బాగుంది. అక్కా బావెక్కడ, నవ్వుతూ బతకాలిరా, నరసింహ నాయుడు, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్‌ వంటి పలు సినిమాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలో చేసిన క్యారెక్టర్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు క్రెడిట్‌ రాలేదు. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. రీసెంట్‌గా భేడియా, దో లఫ్జోంకీ కహానీ, గుడ్డు కీ గన్‌ చిత్రాల్లో కనిపించింది. మెయిడ్‌ ఇన్‌ ఇండియా, గండీ బాత్‌, మాయానగరి : సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌, ఆర్య వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News