Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowUnion Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో అందరి ఫోకస్‌ ఇప్పుడు దీని మీదే ఉంది. అయితే బడ్జెట్ రూపకల్పన ఎలా చేస్తారు.. ఇందులో ఎవరి పాత్ర ఏంటి అనే విషయాలను ఓసారి చూస్తే..

నిర్మలా సీతారామన్‌..

కేంద్ర ఆర్థికమంత్రి. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వకరించిన మహిళగా గుర్తింపు పొందారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండో సారి అధికారంలోకి వచ్చాక.. మోదీ కేబినెట్‌లో కీలక శాఖ అయిన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను రూపొందించడం.. పద్దులను నిర్దేశించడంలో నిర్మలదే కీలక పాత్ర.

టీవీ సోమనాథన్‌..

టీవీ సోమనాథన్‌ కలకత్తా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 ఐఏఎస్‌ అధికారి. ప్రధాని కార్యాలయంతో పాటు ప్రపంచ బ్యాంక్‌లోనూ విధులు నిర్వర్తించారు. బడ్జెట్‌ రూపకల్పన చేసే టీంలో అత్యంత సీనియర్‌ ఈయనే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది టీవీ సోమనాథనే.

అజయ్ సేథ్‌

1987 ఐఏఎస్‌ కేడర్‌ అయిన అజయ్ సేథ్‌.. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బడ్జెట్‌ తయారీలో డేటాను చెక్‌ చేసేది ఈయనే.

తుహిన్‌ కాంత పాండే

పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఈయన పాత్రే కీలకం. ప్రైవేటీకరణ విషయంలో మోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో ఏం చేయబోతోంది అనేది తుహిన్‌ కాంత పాండే సూచనల ఆధారంగానే ఉండనుంది.

సంజయ్‌ మల్హోత్రా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వేతన జీవులను నుంచి కార్పొరేట్‌ కంపెనీల వరకు ఆశగా ఎదురు చూస్తుంటారు. వీరందరినీ సంతృప్తి పరిచే దిశగా బడ్జెట్‌లో సూచనలు ఇచ్చేది ఈయనే. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన ప్రకటనల్లో సంజయ్‌ మల్హోత్రాదే కీలక పాత్ర. ఈయన రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

వివేశ్‌ జోషి

హరియాణా కేడర్‌కు చెందిన 1989 ఐఏఎస్‌ అధికారి. ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. జన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి బీమా యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, క్రెడిట్‌ లైన్‌ వంటి పథకాలన్నీ ఈయనే చూస్తారు.

అనంత నాగేశ్వరన్‌

అనంత నాగేశ్వరన్‌ యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్‌ నుంచి ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. బడ్జెట్‌ తయారీలో కీలక వ్యక్తి. ఆర్థిక సర్వేను రూపొందించడంలో ఈయనదే కీలక పాత్ర.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Nitin Gadkari | 15 ఏళ్లు దాటిన ఆ వాహనాలన్నీ ఇక తుక్కే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News