Sunday, April 14, 2024
- Advertisment -
HomeEntertainmentDisaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత డిజాస్టర్‌ అయిన మూవీస్‌...

Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత డిజాస్టర్‌ అయిన మూవీస్‌ ఇవే..

Disaster movies of 2022 | ఓటమి వెనుక గెలుపు ఉంటుంది. అలాగే విజయాలు ఉన్నప్పుడు అపజయాలు కూడా సాధారణమే. దీనికి సినీ ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. కార్తికేయ 2 వంటి చిన్న చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజైతే.. రాధేశ్యామ్‌, లైగర్‌ వంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి భారీ నష్టాలను తీసుకొచ్చాయి. అలా 2022లో కూడా ఎప్పటిలాగే విజయాల కంటే అపజయాలు డామినేట్ చేశాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని పాన్ ఇండియా సినిమాలు దారుణంగా నిరాశ పరచడంతో.. నష్టాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. మరి ఈ ఏడాది అంత దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..

రాధే శ్యామ్:

2002లో ఎన్ని సినిమాలు వచ్చినా.. అన్నింటి కంటే అతి పెద్ద డిజాస్టర్ మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో చేసింది. కానీ కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు కూడా దాటలేదు. నష్టాల పరంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది రాధే శ్యామ్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 80 కోట్లకు పైగా నష్టాలు మిగిలింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

లైగర్:

ఈ ఏడాది వచ్చినా మరో అతిపెద్ద డిజాస్టర్ లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ దారుణంగా ఫ్లాప్ అయింది. దేశమంతా తిరిగి ప్రమోషన్ చేసుకున్న కూడా సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది లైగర్. సినిమాపై ఉన్న అంచనాలు.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో మొదటి రోజు దాదాపు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు నుంచి చేతులెత్తేసింది. దాదాపు 60 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది లైగర్ సినిమా. తెలుగు తమిళం హిందీ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి ఇండస్ట్రీలో దారుణంగా నిరాశ పరిచింది లైగర్.

ఆచార్య:

తొమ్మిదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలతో ఓకే అనిపించాడు. కానీ 2022 మాత్రం ఈయన అసలు మర్చిపోలేడు. ఎందుకంటే రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. అపజయం ఎరుగని కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు గొడవ కూడా చేశారు. తీసుకున్న రెమ్యూనరేషన్ లో కొంత భాగం చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్ వెనక్కివ్వాల్సి వచ్చింది. ఆచార్య ఫ్లాప్ అయినందుకంటే కొడుకుతో నటించిన మొదటి సినిమా ఆడకపోవడంతో ఎక్కువగా ఫీల్ అయ్యాడు చిరంజీవి. దీంతో పాటు దసరాకు విడుదలైన గాడ్ ఫాదర్ కూడా కమర్షియల్ గా సేఫ్ కాలేదు.

అంటే సుందరానికి:

గతేడాది శ్యామ్ సింగరాయ్ తో మంచి విజయం అందుకున్న నాని.. 2022లో మాత్రం మరోసారి ఫ్లాప్ బాట పెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాబట్టలేదు. మైత్రి మూవీ మేకర్స్ లో గ్యాంగ్ లీడర్ తర్వాత నాని నటించిన సినిమా ఇది. మిగిలిన హీరోలందరికీ బాగానే హిట్స్ ఇచ్చిన మైత్రి నానికి మాత్రం ఇప్పటివరకు విజయం అందించలేకపోయింది. అంటే సుందరానికి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఓటీటీలో మాత్రం మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్‌ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 10 కోట్ల నష్టాలు మిగిల్చింది అంటే సుందరానికి.

ది వారియర్:

రామ్ పోతినేని కూడా ఏడాది ది వారియర్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు. లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేరోజు విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ రెండు భాషల్లోనూ నిరాశపరిచింది. దాదాపు 20 కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.

మాచర్ల నియోజకవర్గం:

నితిన్ కష్టాలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ హీరో.. 2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో వచ్చాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చినా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ కథా కథనాలతో వచ్చిన మాచర్ల నియోజకవర్గం రెండో రోజే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. కానీ ఓటీటీలో మాత్రం అత్యధిక వ్యూస్‌ను రాబట్టింది. ది వారియర్ తర్వాత కృతి శెట్టికి మాచర్ల మరో డిజాస్టర్ గా నిలిచింది. వీటితో పాటు ఈ ఏడాది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మరో డిజాస్టర్ లో కూడా నటించింది కృతి శెట్టి.

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ:

2021 సంక్రాంతికి క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్టు కొట్టిన రవితేజ.. అదే జోరు ఈ ఏడాది కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది ఆయన నుంచి మూడు సినిమాలు వచ్చాయి. ఫిబ్రవరిలో విడుదలైన ఖిలాడి.. డిస్టిబూటర్లకు దాదాపు 11 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది. అలాగే జూన్ లో విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా కనీసం 10 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదు. ఇక ఏడాది చివరలో ధమాకా సినిమాతో వచ్చాడు రవితేజ. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా ఫలితం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

పక్కా కమర్షియల్:

2014లో వచ్చిన లౌక్యం తర్వాత మరో విజయం లేని గోపీచంద్.. ఈ ఏడాది మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతాను అని నమ్మకంగా చెప్పిన గోపి ఆశలను పక్కా కమర్షియల్ దారుణంగా దెబ్బ కొట్టింది. రొటీన్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దాంతో గోపీచంద్ మరోసారి ఫ్లాప్ రుచి చూడాల్సి వచ్చింది. నాగార్జున ది ఘోస్ట్, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు.

గని, రంగ రంగ వైభవంగా:

మెగా కుటుంబంలో ఒక్క రామ్ చరణ్ తప్ప 2022లో ఎవరూ విజయం అందుకోలేకపోయారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాంతో పాటు ఎఫ్3 సినిమా కూడా యావరేజ్ దగ్గర ఆగింది. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా 4 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ గా నిలిచింది. నాగచైతన్య థాంక్యూ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. గతేడాది నాంది సినిమాతో మంచి విజయం అందుకున్న అల్లరి నరేష్.. ఈ ఏడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వచ్చాడు. దీనికి టాక్ బాగానే వచ్చిన కలెక్షన్స్ మాత్రం రాలేదు. విరాటపర్వం సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు.

జిన్నా, సన్ ఆఫ్ ఇండియా:

మంచు కుటుంబానికి 2022 మరోసారి చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. మోహన్ బాబు ఐదేళ్ల తర్వాత హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా ఘోరంగా నిరాశపరిచింది. ఈ సినిమా కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేదు. మరోవైపు మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాకు ఇదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి తిరస్కారం లభించింది. సన్నీ లియోన్ పేరు చెప్పి ప్రమోషన్ చేసుకున్న పని మాత్రం జరగలేదు. వీటితో పాటు మరికొన్ని డిజాస్టర్స్ కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కనీసం 2023లో అయినా ఈ అపజయాల శాతం తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్‌.. ఆ ఒక్క ఫొటో చెక్‌ పెట్టినట్లేనా?

Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్‌ డేట్‌

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News