Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentSneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్‌.. ఆ ఒక్క ఫొటో చెక్‌...

Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్‌.. ఆ ఒక్క ఫొటో చెక్‌ పెట్టినట్లేనా?

Sneha divorce | నటి స్నేహ విడాకులు తీసుకోబోతుందన్న వార్త కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భర్త ప్రసన్నతో మనస్పర్థలు వచ్చాయని అందుకే అతనితో విడిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ వట్టి పుకార్లేనని స్నేహ సన్నిహితులు చాలాసార్లు కొట్టిపారేశారు. డైవోర్స్‌ తీసుకోవడం లేదంటూ పరోక్షంగా స్నేహ కూడా పలుమార్లు చెప్పింది. అయినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తరచూ అవే వార్తలు వస్తున్నాయి. దీంతో విసుగెత్తిపోయిన స్నేహ.. రూమార్స్‌కు గట్టిగానే చెక్‌ పెట్టింది. భర్త ప్రసన్న కౌగిట్లో వాలిపోయి పరవశంలో తేలిపోతున్నట్టుగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అచ్చముండు అచ్చముండు అనే తమిళ చిత్రంలో నటుడు ప్రసన్నతో కలిసి స్నేహ నటించింది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో రహస్యంగా కొన్నాళ్లు తమ ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. 2012లో పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అప్పట్నుంచి ఎంతో అన్యోన్యంగా వీళ్ల కాపురం సాగుతోంది. వీళ్ల పండంటి కాపురానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నట్టు పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి పలు యాడ్స్‌లో కూడా నటించారు. పెళ్లి తర్వాత కొద్దిరోజులు సినిమాకు గ్యాప్‌ ఇచ్చిన స్నేహ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాతనే అసలు సమస్య మొదలైంది.

స్నేహ, ప్రసన్న మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని.. ఇవి తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన స్నేహ సన్నిహితులు ఈ వార్తలను కొట్టిపారేశారు. స్నేహ కూడా తమ బంధం బాగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా పరోక్షంగా పలుమార్లు స్పందించింది. అయినా విడాకుల వార్తలు ఆగలేదు. దీంతో చిరాకెత్తి పోయిన స్నేహ.. ఈ వదంతులు పుట్టించేవారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని అనుకున్నట్టు ఉంది. అందుకే తన భర్త ప్రసన్నతో ఒక ఫొటోషూట్‌ దిగింది. భర్త కౌగిట్లో ఒదిగి పరవశించిపోతూ ఆ ఫొటోలను దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి వాళ్లిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పింది. ఈ ఫొటోలు చూసిన తర్వాత అయినా స్నేహ, ప్రసన్న విడాకుల రూమర్స్‌ ఆగిపోతాయో లేదో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్‌ డేట్‌

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News