Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentchalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు...

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావుకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. చిరునవ్వుతో అందర్నీ నవ్వుతూ పలకరిస్తుంటాడు. అందుకే ఆయన్ను చాలామంది బాబాయ్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే చలపతిరావును చూస్తుంటే ఆయన జీవితంలో కష్టాలేవీ లేవేమో అనుకుంటారు. కానీ ఆయన జీవితం విషాదమయం. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పిల్లలు పుట్టగానే భార్య దూరమైంది. 28 ఏళ్ల వయసులోనే భార్య చనిపోయినప్పటికీ.. ఆమెనే తలచుకుంటూ పిల్లలే లోకంగా బతికాడు.

చదువుకునే రోజుల్లోనే ఇందుమతిని చలపతిరావు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించాడు. 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న చలపతిరావు సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మద్రాసు వచ్చాడు. ఎన్నో కష్టాలు పడి అవకాశాలు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ పరిచయంతో నటుడిగా కొంచెం కొంచెం ఎదుగుతున్నాననే సంతోషంలో ఉన్న ఆ టైమ్‌లోనే ఓ విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్తున్నప్పుడు ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విన్న చలపతిరావును మంటలను ఆర్పాడు. తీవ్రంగా గాయపడిన ఇందుమతి.. మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. అప్పటికి కొడుకు రవిబాబు వయసు ఏడేళ్లు మాత్రమే. ఇద్దరు కూతుళ్లు ఇంకా చిన్నవాళ్లు. దీంతో పిల్లల ఆలనాపాలన చూసుకునేందుకు ఒక ఆడతోడు అవసరమని చాలామంది పెళ్లి చేసుకోవాలని చలపతిరావును బలవంతపెట్టారు. కానీ చలపతిరావు వినిపించుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. భార్య మీద ప్రేమతో చివరి వరకు ఒంటరిగానే ఉండిపోయాడు.

8 నెలల పాటు చక్రాల కుర్చీపైనే

సిల్లీ ఫెల్లోస్ సినిమా షూటింగ్ సమయంలో చలపతిరావుకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు 8 నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ఆ టైమ్‌లో కంటి చూపు కూడా పోయేది. ఇవే కాకుండా జీవితంలో మరోన్నో విషాదాలను చూసినప్పటికీ అందర్నీ నవ్వుతూ పలకరించేవాడని సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News