Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentChalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చలపతిరావు నటనకు దూరంగా ఉన్నారు. 1944 మే8 కృష్ణా జిల్లా పాముర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతి రావు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినిమారంగంలోకి అడుగుపెట్టి.. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 1200 పైగా చిత్రాల్లో నటించారు.

రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చలపతి రావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో తన కుమారుడు రవిబాబు ఇంట్లో చలపతిరావు ఉంటున్నారు. 1966లో విడుదలైన గూడాఛారి 116 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.

చలపతిరావు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాంచరణ్ ఇలా మూడు తరాల నటులతోనూ నటించారు. వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. బంగార్రాజు ఆయన చివరి చిత్రం. అమెరికాలో ఉంటున్న కుమార్తె వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala satyanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News