chalapathi rao | విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న చలపతిరావు జీవితంలో అందమైన ప్రేమ కథ ఉంది. తొలిచూపులోనే ఓ అమ్మాయిని ఇష్టపడ్డ చలపతిరావు.. ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే సాహసం చేశానంటూ ఓ సందర్భంలో చలపతిరావు అందమైన తన ప్రేమకథను వివరించాడు.
అప్పుడు చలపతిరావుకు 19 ఏళ్లు. బందరులో పీయూసీ చదువుతున్నాడు. పొడవుగా, అందంగా ఉండటంతో అయన్ను చూసి ఇందుమతి అనే అమ్మాయి ఇంప్రెస్ అయ్యింది. వెంటనే వచ్చి చలపతి రావుకు ప్రపోజ్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అమ్మాయే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో సర్‌ప్రైజ్‌కు గురైన చలపతిరావు.. ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. ఈ విషయం తెలిసిన చలపతిరావు ఫ్రెండ్స్.. వాళ్లను బెజవాడ తీసుకెళ్లి పెళ్లి చేసేశారు. అలా ఎలాంటి ప్రేమలేఖలు లేకుండా తమ ప్రేమ.. పెళ్లి దాకా వచ్చేసిందని అప్పట్లో చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇందుమతిని తీసుకెళ్లి ఇంట్లో వాళ్లను ఒప్పించాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ముగ్గురు పిల్లలు పట్టిన తర్వాత ఓ ప్రమాదంలో చలపతి భార్య ఇందుమతి మరణించింది.

ఇందుమతి మరణించిన తర్వాత చాలామంది చలపతిరావును పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ చలపతిరావు వినిపించుకోలేదు. తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ గడిపేశాడు. ప్రస్తుతం చలపతిరావు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో సెటిల్ అయ్యారు. కొడుకు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనారోగ్యం కారణంగా కొద్దిరోజులుగా రవిబాబు దగ్గరే ఉంటున్న చలపతి రావు.. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశాడు.
Read More Articles |
Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం
Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?
Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్