Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentchalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు...

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

chalapathi rao | చలపతిరావు అంటే చాలామందికి గుర్తొచ్చేది రేపు సీన్లే. వయసులో ఉన్నప్పుడు దాదాపు ఆయనకు అలాంటి క్యారెక్టర్లే వచ్చేవి. వాటికి మంచి క్రేజ్ కూడా ఉండేది. అందుకే రేప్ సీన్ ఉందంటే చాలు అప్పట్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చలపతినే కలిసేవారు. సీనియర్ నటులు కూడా మన చలపాయి ఉన్నాడు కదా చేసేస్తాడు అనేవాళ్లు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్న చలపతి రావు ఏకంగా 94 రేప్ సీన్స్‌లో నటించి రికార్డు సృష్టించాడు.

అప్పట్లో చాలావరకు సినిమాల్లో రేప్ సీన్స్ ఉండేవి. భార్యనో.. చెల్లినో రేప్ చేస్తే హీరో వచ్చి పగ తీర్చుకోవడమనే కామన్ పాయింట్ చుట్టే సినిమాలు తిరిగేవి.అలాంటి రేప్ సీన్స్‌లో చలపతిరావు నటించేవాడు. మంచి ఎత్తు, పర్సనాలిటీ ఉండటంతో ఆ సీన్స్‌కు చలపతిరావు అయితేనే సరిపోతాడని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఫిక్సపోయారు. రావుగోపాలరావు వంటి సీనియర్ నటులు కూడా రేప్ సీన్ ఉందంటే.. మన చలపాయ్‌ని పిలిచేయండి చేసేస్తాడు అని అనేవాళ్లు అంతలా సినిమాల్లో పేరు మోసిన రేపిస్ట్ అయ్యాడు. కెరీర్‌లో ఏకంగా 94 రేప్ సీన్స్‌లో నటించాడు అలా తన ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో 1200కి పైగా సినిమాల్లో నటిస్తే రేప్ సీన్స్‌తోనే ఎక్కువ పాపులారిటీ పొందాడు.

అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. చలపతిరావు నిజంగానే బాగా తాగుతాడని, రేపులు చేస్తాడని బయట అనుకోవడం కూడా మొదలైంది.దీంతో ఆడవాళ్లు తనను చూస్తేనే ఆమడదూరం పారిపోయేవాళ్లని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చలపతిరావు బయటపెట్టాడు. అవుట్ డోర్ షూటింగ్ కోసం వెళ్తే తను ఉండే హోటల్‌లో హీరోయిన్లు అస్సలు ఉండేవాళ్లు కాదని చెప్పుకొచ్చాడు. కానీ తను అలాంటి వ్యక్తిని కాదని చలపతిరావు చెబుతుంటాడు. ఎన్టీఆర్‌తో సాంగత్యం కారణంగా ఎలాంటి చెడు అలవాట్లు తన దరిచేరలేవని అంటుంటాడు. ఏడున్నరకు తినడం, ఎనిమిదిన్నరకు పడుకోవడం ఇదే తన అలవాటని అంటాడు. కానీ ఏదేమైనా ఇండస్ట్రీలో మాత్రం చలపతిరావు రేపులు చేస్తాడని బాగా పాపులర్ అయిపోయాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News