Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalAfghanistan university ban | ఆ నిర్ణయానికి బదులు మా తలలు నరికేసినా బాగుండేది.. అఫ్గాన్‌లో...

Afghanistan university ban | ఆ నిర్ణయానికి బదులు మా తలలు నరికేసినా బాగుండేది.. అఫ్గాన్‌లో పరిస్థితిపై 19 ఏళ్ల యువతి ఆవేదన

Afghanistan university ban | అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు హక్కులే లేకుండా పోతున్నాయి. వాళ్ల జీవితంలో విద్య, స్వేచ్ఛ అనే పదాలే లేకుండా చేసేస్తున్నారు తాలిబన్లు. అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. డ్రెస్‌ కోడ్‌ పేరుతో అమ్మాయిలకు ఉన్నత విద్య లేకుండా చేసేశారు. అమ్మాయిలకు యూనివర్సిటీల్లో ప్రవేశమే లేదంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ దేశ వ్యాప్తంగా మహిళలు నిరసనలకు దిగుతున్నా తాలిబన్ల మనసు కరగడం లేదు. నిరసనలకు దిగితే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఈ క్రమంలో తమకు జరుగుతున్న అన్యాయంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా 19 ఏళ్ల అమ్మాయి మార్వా తన ఆవేదనను, ఆక్రోషాన్ని వెల్లగక్కింది. యూనివర్సిటీల్లోకి అనుమతించడాన్ని నిషేధించే బదులు మా తలలు నరికేసినా సంతోషంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసింది. ” మాకు చదువుకునే హక్కు లేకుంటే.. అసలు మేం పుట్టకపోయి ఉంటే బాగుండేదని కోరుకుంటా. ఈ ప్రపంచంలో ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు బాధపడుతున్నా. మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. పశువులు ఎక్కడికైనా వెళ్లగలవు. కానీ బాలికలకు ఇంట్లోంచి బయట అడుగు పెట్టేందుకు కూడా హక్కులేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మార్వా.

కాబూల్‌లోని మెడికల్‌ యూనివర్సిటీలో మెడికల్‌ డిగ్రీలో చేరేందుకు ఇటీవలే ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది మార్వా. తన సోదరుడు హమీద్‌తో కలిసి యూనివర్సిటీకి వెళ్లాలని కలలు కన్నది. కానీ తాలిబన్లు తీసుకున్న నిర్ణయం ఆమె ఆశలను నాశనం చేసింది. ఎన్నో కష్టాలు పడి తన సోదరి 12వ తరగతి వరకు చదువుకున్నదని, ఆమె జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉన్నాయని మార్వా సోదరుడు హమీద్‌ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు చదివి లక్ష్యాన్ని సాధిస్తుందని అనుకున్నట్లు తన బాధను చెప్పుకొచ్చాడు.

ఎందుకీ నిషేధం

కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునే అమ్మాయిలు డ్రెస్‌ కోడ్‌ పాటించడం లేదని తాలిబన్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లాం పద్ధతులు, అప్గానిస్థాన్‌ సంస్కృతిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని స్వయంగా ఆ దేశ విద్యాశాఖ మంత్రి నదీమ్‌ ఆరోపించారు. అందుకే ఉన్నత విద్యకు అమ్మాయిలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

US visa interview | అమెరికా వెళ్లేవారికి గుడ్‌ న్యూస్‌.. వీసా కోసం ఇంటర్వ్యూలు అక్కర్లేదు !!

Imran khan ex Wife reham khan | పదేండ్ల చిన్నవాడితో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య మూడో పెళ్లి

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Bomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Python massage | కొండ చిలువతో మసాజ్ చేపించుకోవాలనుందా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News