Home Business Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత...

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

Image by rawpixel.com on Freepik

Phone Pe | ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసి.. వేరే వాళ్ల అకౌంట్‌లో వేయాల్సి వచ్చేది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అరచేతిలో ఉండే మొబైల్‌తోనే అయిపోతున్నాయి. జేబులో నుంచి స్మార్ట్‌ఫోన్‌ తీసి యూపీఐ విధానంలో ఎవరికి కావాలంటే వాళ్లకు చిటికెలో డబ్బులు పంపించేస్తున్నారు. దీనికోసం ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం ఇలా రకరకాల యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి యూపీఐ ( Unified Payments Interface – UPI ) ఐడీ ద్వారా ఒకరి అకౌంట్‌ నుంచి మరొకరి అకౌంట్‌కి ఒక్కరోజులో ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు? ఏ యాప్‌ ఎంత లిమిట్‌ వస్తుందనే విషయాలు మీకు తెలుసా ! ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్‌ పే

అమెజాన్‌ పే ద్వారా ఒక్క రోజులో లక్ష రూపాయల వరకు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. దీనికి ఎలాంటి లిమిట్‌ లేదు. అయితే మీరు అమెజాన్‌ పేలో రిజిస్టర్‌ చేసుకున్న ఫస్ట్‌ డే మాత్రం కేవలం రూ.5వేలు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు వీలవుతుంది.

గూగుల్‌ పే

అమెజాన్‌ పే తరహాలోనే గూగుల్‌ పే నుంచి కూడా ఒక్కరోజులో లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అమౌంట్‌ విషయంలో ఎలాంటి లిమిటేషన్స్‌ లేవు. కాకపోతే ట్రాన్సక్షన్స్‌పై కొన్ని పరిమితులు ఉన్నాయి. గూగుల్‌ పే ద్వారా ఒక్కరోజులో 10 కంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్‌ చేయడానికి కుదరదు. దీనికి నగదు విలువతో సంబంధం లేదు.

ఫోన్‌ పే

గూగుల్‌ పే, అమెజాన్‌ పే తరహాలో ఫోన్‌ పే నుంచి కూడా ఒక్కరోజులో లక్ష రూపాయల వరకు ఇతరులకు పంపించవచ్చు. మనం ఎవరికైతే డబ్బులు పంపిస్తామో వాళ్ల అకౌంట్‌ ఉన్న బ్యాంకు పరిమితులకు లోబడి రూ. లక్ష లోపు ఎన్ని ట్రాన్సక్షన్స్‌ అయినా చేయవచ్చు.

పేటీఎం

ఒక్కరోజులో లక్ష రూపాయల వరకు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అవకాశం పేటీఎం అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ ట్రాన్సక్షన్స్‌కు సంబంధించి పలు పరిమితులను కూడా పేటీఎం విధిస్తుంది. పీటీఎం ద్వారా ఒక గంటలో రూ.20వేల కంటే ఎక్కువ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉండదు. అలాగే ఒక గంటలో 5 కంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్‌కు పేటీఎం అనుమతించదు. అదే రోజులో 20 ట్రాన్సక్షన్స్‌ మాత్రమే చేయవచ్చు. ఈ 20 ట్రాన్సక్షన్స్‌లో లక్ష రూపాయలకు మించి ట్రాన్స్‌ఫర్ చేయలేం.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Mobile Charging | మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలా? ఈ టిప్స్ పాటించండి.

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

Exit mobile version