Home Latest News Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌...

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

Upcoming Electric Bikes | పెట్రోల్‌, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్‌ బైకులకు డిమాండ్‌ పెరిగిపోయింది. 2022లో ఎలక్ట్రిక్‌ బైకుల అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. ప్రముఖ కంపెనీలు మార్కెట్లోకి రాకముందే చాలా వరకు స్ట్రార్టప్‌ కంపెనీల ఎలక్ట్రానిక్‌ బైకుల విక్రయాల్లో దూసుకెళ్లాయి. ఓలా, రివోల్ట్ లాంటి బైకులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో బజాజ్‌, యమహా, కేటీఎం లాంటి ప్రముఖ కంపెనీలు కూడా సరికొత్త ఎలక్ట్రిక్‌ బైకులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది వచ్చే కొత్త ఎలక్ట్రిక్‌ బైకులేవి? వాటి విశేషాలేంటో ఓ సారి లుక్కేయండి మరి..

అల్ట్రావయోలెట్‌ ఎఫ్‌77 సూపర్‌ బైక్‌

గత ఏడాది నవంబరులో అల్ట్రావయోలెట్ ఎఫ్‌ 77 సూపర్‌ బైకును ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది. ఇప్పుడున్న అన్ని ఎలక్ట్రిక్‌ బైకులతో పోలిస్తే ధర చాలా ఎక్కువ. అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్‌ బైకుగా ఇది మార్కెట్లో రికార్డు సృష్టించనుంది. దీని ప్రారంభ ధర రూ. 3.8 లక్షలు. స్పోర్ట్స్‌ లుక్‌లో ఎలక్ట్రిక్‌ సూపర్‌ బైక్స్‌ కోసం ఎదురుచూసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రిక్‌ బైకును డిజైన్‌ చేశారు. దీని అత్యధిక వేగం 152 కిలోమీటర్లు కాగా 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 2.9 సెకండ్లలోనే అందుకుంటుందని సంస్థ తెలిపింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 307 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని తెలిపింది.

Upcoming Electric Bikes | ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌

ఓలా ఇప్పటికే ఎస్‌1 సిరీస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటికి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు భవీష్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలోని ఓలా ఈ ఏడాది మరో కొత్త ఎలక్ట్రిక్‌ బైకును మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్‌ చేసింది. ఎలాంటి బైక్‌ అయితే మీకు నచ్చుతుందంటూ భవీష్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌లో వినియోగదారుల అభిప్రాయాన్ని కూడా కోరారు.

ఓబెన్‌

ఎలక్ట్రిక్ బైక్స్‌లో స్పోర్ట్స్‌ లుక్‌ కోసం ఎదురు చూసే వాళ్ల కోసం బెంగళూరుకు చెందిన ఓబెన్‌ సంస్థ సరికొత్త బైకును ఈ ఏడాది మార్కెట్లోకి తీసురానుంది. ఓబెన్‌ రోర్‌ పేరుతో విడుదల చేసే ఈ స్పోర్ట్స్‌ బైకు కోసం ఇప్పటికే 17వేల బుకింగ్స్‌ అయ్యాయి. దీని ధర రూ.99,999 మాత్రమే. దీని టాప్ స్పీడు గంటకు 100 కిలోమీటర్లు కాగా ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించగలదని ఓబెన్‌ సంస్థ పేర్కొంది. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

కేటీఎం ఈ-డ్యూక్‌

బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సక్సెస్‌ కావడంతో ఈ ఏడాది కేటీఎం ఈ-బైకును మార్కెట్లోకి తీసుకురావాలని బజాజ్‌ సంస్థ చూస్తోంది. ఈ ఏడాది జూన్‌ వరకు మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. 5.5కేడబ్ల్యూ, 10కేడబ్ల్యూ బ్యాటరీలతో ఈ బైకులో రెండు వేరియంట్లను సంస్థ విడుదల చేయనుంది.

హస్క్‌వర్నా ఈ-పిలెన్‌

బజాజ్‌ సంస్థ నుంచి ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ పేరు హస్క్‌వర్నా ఈ-పీలెన్‌. హస్క్‌వర్నా మాతృసంస్థలో బజాజ్ మేజర్‌ షేర్‌హోల్డర్‌. కేటీఎం ఈ-బైక్‌ తరహాలోనే స్పోర్ట్స్‌ లుక్‌లో సేమ్‌ సైజ్ బ్యాటరీలతో దీన్ని డిజైన్‌ చేశారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ పేర్కొంది.

రప్టీ ఎలక్ట్రిక్‌ బైక్‌

రప్టీ అనే మరో సంస్థ కూడా తన మొదటి ఎలక్ట్రిక్‌ బైకును ఈ ఏడాది జూన్‌లోపు మార్కెట్లోకి తీసుకురానుంది. గంటకు 135 కిలోమీటర్ల గరిష్ఠ వేగం దీని ప్రత్యేకత. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-47

హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-47 ఎలక్ట్రిక్‌ బైకును ఆటో ఎక్స్‌పో 2020లో హీరో సంస్థ ఆవిష్కరించింది. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది దీన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. చార్జింగ్ సమస్య లేకుండా స్వాపబుల్‌ బ్యాటరీ విధానంలో ఈ బైకును తీసుకురానున్నారు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హీరో సంస్థ పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Uber ride via Whatsapp | ఇక వాట్సాప్‌లోనే ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Exit mobile version