Home Latest News Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే...

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Image Source : Pixabay

Tech tips | రోజూ మనకు ఎన్నో మెయిల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్నింటిలో ఎలాంటి టెక్ట్స్ ఉండదు. కేవలం ఇమేజ్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి మెయిల్స్ రావడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ మీకు ఇలాంటి మెయిల్స్ ఏమైనా వచ్చి ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే అలాంటి వాటిల్లో పిక్సెల్ ట్రాకర్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి మెయిల్స్ పొరపాటున ఓపెన్ చేస్తే..అది మన కంప్యూటర్/లాప్‌టాప్ లేదా మొబైల్‌లో చేరిపోతుంది. అక్కడి నుంచి మన వివరాలను సైబర్ నేరగాళ్లకు పంపిస్తుంది. కాబట్టి ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు మెయిల్స్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిల్స్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

✉ మెయిల్‌లో ఆటోలోడ్ ఇమేజెస్‌ను డిజెబుల్ చేసుకోవాలి.

✉ ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పుడూ మెయిల్స్ ద్వారా పంపించవద్దు.

✉ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ , సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను మెయిల్స్‌లో పంపించవద్దు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్స్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అన్‌నోన్ సెండర్స్ నుంచి పీడీఎఫ్ ఇతరత్రా అటాచ్‌మెంట్స్ వస్తుంటాయి. వీటి ద్వారా హ్యాకర్లు మన డివైజ్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని వీలైనంత వరకు ఓపెన్ చేయకపోవడం మంచిది.

✉ స్పామ్ మెయిల్స్‌లోని లింకులను ఎప్పుడూ ఓపెన్ చేయవద్దు. వాటికి రిప్లై కూడా ఇవ్వకూడదు.ఒకవేళ వాటికి రిప్లై ఇస్తే మరిన్ని స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పామ్ మెయిల్స్‌కు రెస్పాన్స్ అవ్వకూడదు. వీలైతే రిపోర్ట్ చేయడం మంచిది. వీటితో పాటు మెయిల్ ఇన్‌బాక్స్‌లో ఫిల్టర్ యూజ్ చేయడం బెటర్.

✉ ఏ వెబ్‌సైట్‌లో పడితే ఆ సైట్‌లో మన మెయిల్ ఐడీని ఇవ్వడం మంచిది కాదు. అవసరమైతే పబ్లిక్ వెబ్‌సైట్స్‌లో వేరే నంబర్లను ఇవ్వాలి.

✉ మెసేజ్‌లు, కామెంట్ బోర్డుల్లో మెయిల్ ఐడీని పోస్టు చేయవద్దు.

✉ ఓపెన్ వైఫై నెట్‌వర్క్ కనెక్ట్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. దీనివల్ల హ్యాకర్ల నుంచి ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఓపెన్ లేదా పబ్లిక్ నెట్‌వర్క్స్‌కి కనెక్ట్ కాకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కనెక్ట్ కావాల్సి వస్తే బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్స్‌లో లాగిన్ అవ్వకూడదు.

✉ ఇక జీమెయిల్ పాస్‌వర్డ్‌లను ప్రతి 60 రోజులకు ఒకసారి మార్చుకోవడం ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మనం మార్చుకునే పాస్‌వర్డ్‌ కూడా ఈజీగా అంచనా వేసేలా ఉండకూడదు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Mobile Charging | మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలా? ఈ టిప్స్ పాటించండి.

GB Whatsapp | మీరు వాడుతున్న వాట్సాప్ అసలైనదేనా?

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Exit mobile version