Home Latest News Mobile Charging | మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలా? ఈ టిప్స్ పాటించండి.

Mobile Charging | మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలా? ఈ టిప్స్ పాటించండి.

Mobile Charging | ఇప్పుడు స్మార్ట్ఫోన్ యూజర్లు చాలావరకు ఎదుర్కొంటున్న సమస్య బ్యాటరీ బ్యాక్అప్. ఐదు వేలు ఆరువేల ఎంహెఎచ్ బ్యాటరీలు వాడుతున్నా కూడా స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఒక్కరోజు కంటే ఎక్కువ రావడం లేదు. దీనికి కారణం ఫోన్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోవడమే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా కాల్స్ మాట్లాడటమో.. ఫేస్బుక్, ఇన్స్టా అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గడపడం లేదంటే యూట్యూబ్లో వీడియోలు చూడటం చేస్తూనే ఉన్నారు. ఇలా 24 గంటలు ఏదో ఒక దానికి ఫోన్ వాడుతుండటంతో మొబైల్ బ్యాటరీ ఎంతసేపూ రావడం లేదు. ఫోన్ యూసేజ్ను తగ్గించడం అంటే ఇప్పుడు కుదరని పని.. కాకపోతే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా బ్యాటరీ లైఫ్ను పెంచుకోవద్దు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతూ ఉంటాయి. స్టేటస్లు, పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ను ఇస్తుంటాయి. కాబట్టి దీనికోసం ఎక్కువ బ్యాటరీ వినియోగించుకుంటాయి. కాబట్టి వీటికి బ్యాక్గ్రౌండ్ ఇంటర్నెట్ వినియోగాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి.
  • కొంతమంది మొబైల్లో వైఫై ఆన్ చేసి అలాగే వదిలేస్తారు. దీనివల్ల కూడా బ్యాటరీ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు వైఫై, బ్లూటూత్ ఆఫ్లో పెట్టుకోవాలి.
  • చాలామంది మొబైల్లో యాప్స్ ఓపెన్ చేస్తే వాటిని అలాగే వదిలేస్తారు. హోం బటన్ క్లిక్ చేసి లాక్ చేస్తుంటారు. యాప్స్ను పూర్తిగా క్లోజ్ చేయకపోవడం వల్ల వాటికి బ్యాటరీ యూజ్ అవుతుంది. కానీ టాస్క్ మేనేజర్ ద్వారా వాటిని పూర్తిగా క్లోజ్ చేయడం మంచిది.
  • బ్యాటరీ 20 శాతం కంటే తగ్గింది అనుకుంటే లో పవర్ మోడ్ను టర్న్ ఆన్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు బేసిక్ కార్యకలాపాలను నిలిపివేస్తుంది. దీనివల్ల బ్యాటరీ తక్కువ వినియోగం అవుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

WHO on Corona Cases | ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా వేవ్‌లు వచ్చే ఛాన్స్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Exit mobile version