Marriage | మహిళలు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇంకా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూంటారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు వస్తే చెప్పాల్సిన పనే లేదు. వెరైటీ వెరైటీ మేకప్ లతో అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాగే ఓ వధువు తన పెళ్లికి ముఖాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన పెళ్లి కొడుకు తనకు ఈ పెళ్లే వద్దంటూ రద్దు చేసుకొని వెళ్లి పోయాడు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు నిశ్చతార్ధం కార్యక్రమంలో వధువు, వరుడు పెళ్లి ఫొటోలతో సందడి చేశారు. పెళ్లికి పదిరోజుల సమయం ఉండగా వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ముఖం అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్తరకం మేకప్ ట్రై చేసేందుకు సిద్ధమైంది.
బ్యూటీషియన్ మేకప్‌కు ముందు ముఖానికి ఫౌండేషన్ రాసి ఆ తరువాత ఆవిరి పట్టింది. దీంతో ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. ముఖం నిండా బొబ్బలు వచ్చి వధువు అంద వికారంగా మారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వధువు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. యువతికి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ.. ముఖం వాపు వచ్చి అంధవికారంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న వరుడు ఆస్పత్రికి వెళ్లి వధువును పరామర్శించాడు. ఆమె గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం, ముఖం అందవిహీనంగా మారడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. రెండురోజుల తరువాత తనకు ఈ పెళ్లి వద్దంటూ క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే, వధువు ముఖం అందవికారంగా మారడానికి కారణమైన బ్యూటీషియన్‌ను వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Balagam Movie | బలగం.. మట్టి వాసనంత అచ్చమైన పల్లెటూరి సినిమా..
Lavanya Tripathi | అలాంటివి ఇష్టమే ఉండదు.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి
Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్
Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!