Thursday, September 21, 2023
- Advertisment -
HomeEntertainmentAllu Arjun | అనౌన్స్మెంట్ కాదు అప్లిమెంట్ ఎప్పుడు.. ఐకాన్ స్టార్ పేరు మారిపోతుందిగా..!

Allu Arjun | అనౌన్స్మెంట్ కాదు అప్లిమెంట్ ఎప్పుడు.. ఐకాన్ స్టార్ పేరు మారిపోతుందిగా..!

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త అనౌన్స్మెంట్ స్టార్ గా మారిపోతున్నాడు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ వాటిని ముందుకు తీసుకెళ్లడం లేదు. పుష్ప సిరీస్ మొదలు పెట్టిన తర్వాత రెండు సినిమాలు ఒప్పుకుని వాటిని పక్కన పెట్టేసాడు బన్నీ.

దాని కంటే ముందు ఒక భారీ సినిమా ఒప్పుకొని ముందుకు తీసుకుని వెళ్లలేకపోయాడు అల్లు అర్జున్. తాజాగా మరో సినిమా కూడా అనౌన్స్ చేశాడు ఈయన. అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు అల్లు అర్జున్. ఈ సినిమా 2024లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న గురూజీ.. ఆ వెంటనే అల్లు అర్జున్ సినిమాకు షిఫ్ట్ కావాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. దాంతో ఇప్పుడు నాలుగో సినిమా కోసం ముహూర్తం పెట్టబోతున్నారు త్రివిక్రమ్, అల్లు అర్జున్. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా కూడా ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

అప్పటి వరకు ఇద్దరి మూడ్ అలాగే ఉంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.. అలా కాకుండా ఏమాత్రం మారినా కూడా అల్లు అర్జున్ ఖాతాలో మరో సినిమా అనౌన్స్మెంట్ అయ్యి ఆగిపోయినట్టే. 2017లో తమిళ దర్శకుడు లింగస్వామితో ఒక సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తుందని అప్పట్లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చెన్నై వెళ్లి ఈ సినిమాను లాంచనంగా మొదలు పెట్టాడు బన్నీ. కాకపోతే కథ నచ్చక దీన్ని మొదట్లోనే ఆపేశాడు.

ఆ తర్వాత 2019 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా అనౌన్స్ చేశాడు దిల్ రాజు. దీనికి కనబడుట లేదు అనే క్యాప్షన్ పెట్టారు. దానికి తగ్గట్టే ఇప్పటివరకు సినిమా కనపడలేదు. ఇక 2020 జూలై 31న కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. ఇది కూడా కేవలం ప్రకటనతోనే ఆగిపోయింది. ఇప్పుడు అనౌన్స్ చేసిన సందీప్ సినిమా అయినా మెటీరియలైజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఐకాన్ స్టార్ అభిమానుల్లో కూడా ఉన్నాయి. మరి చూడాలిక ఏం జరుగుతుందో.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Balagam Movie | బలగం.. మట్టి వాసనంత అచ్చమైన పల్లెటూరి సినిమా..

Lavanya Tripathi | అలాంటివి ఇష్టమే ఉండదు.. పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News