Home Latest News Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Smart phone | అప్పట్లో మొబైల్ కొంటే ఏళ్లతరబడి అలాగే ఉండేవి. చిన్న సమస్యలు కూడా వచ్చేవి కాదు. చార్జింగ్ కూడా రెండు మూడు రోజులకు పైగానే వచ్చేది. కానీ ఇప్పుడు చార్జింగ్ అస్సలే ఆగట్లేదు. బ్యాటరీలు తొందరగా పాడైపోతున్నాయి. ఛార్జింగ్ ఆగట్లేదని ఏడాది తిరగకుండానే కొత్త ఫోన్ కొనాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? తెలిసి తెలియక మనం చేసే కొన్ని పొరపాట్లే ఈ సమస్యకు కారణం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గతంతో పోలిస్తే మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మనం వాడే యాప్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇది కాకుండా ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రైనా ఫోన్ వదలకుండా వాడుతుండటం ఇవన్నీ బ్యాటరీ మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఓకే.. ఇవి కాకుండా ఛార్జింగ్ విషయంలో మనం చేసే పొరపాట్లు కూడా బ్యాటరీ లైఫ్టైమ్ను తగ్గించేస్తున్నాయి.

ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్ వాడటం

మొబైల్ కొన్న కొత్తలో కంపెనీతో వచ్చిన ఛార్జర్ వాడుతాం. కానీ కొద్దిరోజులైన తర్వాత ఏది దొరికితే దానితోనే ఛార్జింగ్ చేస్తుంటాం. బయట ఉన్నప్పుడు చార్జర్ తీసుకెళ్లకపోవడం వల్ల వేరేది వాడుతాం. కానీ ఇంట్లో ఉన్న కూడా చార్జర్ను వెతికేందుకు బద్దకంతో అందుబాటులో ఉన్న మరోదానితో ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. కామన్గా ఇది అందరూ చేసే పొరపాటే. కానీ ఎప్పుడూ ఒకే రకమైన చార్జర్ వాడకపోవడం వల్ల బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కో మొబైల్ తయారీ కంపెనీ ఒక్కో చార్జర్ను అందిస్తుంటాయి. శాంసంగ్ కంపెనీ 18, 25 వాట్ల ఛార్జర్లను ఇస్తుంటే.. రియల్మీ 18, 37, 67 వాట్ల చార్జర్లను వాడుతుంటాయి. అలాంటప్పుడు ఒక దాని చార్జర్ మరోదానికి వాడినప్పుడు కచ్చితంగా బ్యాటరీ దెబ్బతింటుంది.

100 పర్సెంట్ అక్కర్లేదు

చాలామంది మొబైల్కు వంద శాతం ఛార్జింగ్ అవ్వాలని చూస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇలా రెగ్యులర్గా 100 శాతం ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీతో పాటు ఫోన్ ప్రాసెసర్ పాడవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం ఛార్జింగ్ నిండితే సరిపోతుందని సూచిస్తున్నారు.

మాటిమాటికీ చార్జింగ్ పెట్టొద్దు

చాలామందికి ఇదొక అలవాటు. బ్యాటరీ కొంచెం దిగిందంటే చాలు తీసుకెళ్లి ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా మాటిమాటికి ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ కెపాసిటీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి తరచూ ఛార్జింగ్ పెట్టద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

బ్యాటరీ పూర్తిగా డెడ్ కానివ్వద్దు

మాటిమాటికి ఛార్జింగ్ పెట్టొద్దన్నారని మొత్తం బ్యాటరీ అయిపోయే దాకా కూడా వేచి ఉండొద్దు. బ్యాటరీ జీరోకి చేరుకున్న తర్వాత చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బ తింటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Poorna | తల్లి కాబోతున్న నటి పూర్ణ.. న్యూఇయర్‌ వేళ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్న మలయాళ బ్యూటీ

Unstoppable | అన్‌స్టాపబుల్ షో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేవారికి షాక్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Waltair veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. నిజంగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Prabhas | కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను ఇరుకున పెట్టిన బాలయ్య.. రెబల్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడా?

Manchu Vishnu | బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

Exit mobile version