Home Business Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Dollar | మన దేశ కరెన్సీని డాలర్‌తో పోల్చడం గమనించే ఉంటారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంత పడిపోయింది.. అంత పడిపోయిందని ఇటీవల వార్తల్లో తరచుగా వింటూనే ఉన్నాం. మన రూపాయినే కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే పోలుస్తారు. అసలు వివిధ దేశాల కరెన్సీలను అమెరికన్ డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు? దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా శక్తివంతమైన దేశంగా ఎదిగింది. కానీ అంతకముందు బ్రిటన్ శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉండేది. ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటన్ ఆధీనంలోనే ఉండేవి. దీంతో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ పౌండ్లలోనే నగదు బదిలీలు, చెల్లింపులు చేసేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని తలకిందులయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆయుధాల తయారీపై అమెరికా దృష్టిపెట్టింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను తయారు చేసింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని దేశాలు అమెరికా నుంచే ఆయుధాలను కొనుగోలు చేశాయి. అప్పుడు యూఎస్ డబ్బుకు బదులుగా బంగారం రూపంలో చెల్లింపులను తీసుకుంది.

ఇలా యుద్ధం ముగిసేసరికి అమెరికా వద్ద బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి. యుద్ధం వల్ల కలిగిన నష్టంతో మిగిలిన దేశాలు మాత్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చేశాయి. కానీ బంగారం నిల్వలు అధికంగా ఉండటంతో అమెరికా కరెన్సీ మాత్రం స్థిరంగా ఉంది. దీంతో అన్ని దేశాలకు ప్రయోజనం కలిగించే విధంగా విదేశీ మారక ఎక్సెంజీ ఉండేందుకు ఒక వ్యవస్థను తయారు చేయటం కోసం 1944లో 44 మిత్ర దేశాల ప్రతినిధులు అమెరికాలోని బ్రెట్జన్‌వుడ్‌లో సమావేశమయ్యారు. ఇందులో ఆయా దేశాల కరెన్సీని బంగారానికి కాకుండా అమెరికా డాలర్‌కు అనుసంధానం చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అమెరికా డాలర్ మాత్రం బంగారానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం దేశాల కేంద్ర బ్యాంకులు అమెరికా డాలర్‌తో ఒక నిర్ణీత ఎక్సెంజీ రేటు కలిగి ఉంటుంది. దీని ఆధారంగా వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు యూఎస్ డాలర్‌ను వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా ప్రకటించాయి.

అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు క్రూడాయిల్ కోసం అరబ్ దేశాలను ఆశ్రయిస్తాయి. దీంతో అరబ్ దేశాల్లోని క్రూడాయిల్ నిల్వలకు రక్షణ ఇస్తామని.. అందుకు బదులుగా తమ క్రూడ్‌ను యూఎస్ డాలర్‌ రూపంలో సేల్ చేయాలని కండిషన్ పెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా శక్తివంతమైన దేశంగా మారడంతో.. అరబ్ దేశాలు ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. ఇక అన్ని దేశాలకు క్రూడాయిల్ అవసరమే కాబట్టి అమెరికా డాలర్‌ను వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా ఆమోదించక తప్పలేదు.

ఇది జరిగిన కొంతకాలానికి అమెరికన్ డాలర్లపై ఆందోళన మొదలైంది. ఈ ఆందోళన కారణంగా దేశాలన్నీ తమ వద్ద ఉన్న డాలర్లను బంగారంలోకి మార్చుకోవడం ప్రారంభించాయి. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారంతో డాలర్‌ను డీలింక్ చేస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో నిర్ణీత ఎక్సేంజి రేటు ముగిసి.. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ ఎక్సేంజి రేటు అమల్లోకి వచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Exit mobile version