Home Entertainment Manchu Vishnu | బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

Manchu Vishnu | బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు.. సర్‌ప్రైజ్ అవుతున్న ఫ్యాన్స్

Image Source : Twitter

Manchu Vishnu | బిగ్‌బాస్ ( Bigg boss ) సీజన్ 6 అయిపోయినప్పటి నుంచి ఒక్కటే టాక్. బిగ్‌బాస్ విన్నర్ ఎవ్వరు అన్నదానికంటే కూడా తర్వాత సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారనే చర్చలే మొదలయ్యాయి. గత నాలుగైదు సీజన్స్‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున తప్పుకుంటున్నారని తెలియడంతో నెక్ట్స్ సీజన్ హోస్ట్ ఎవరనే దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకొస్తారు. బాలకృష్ణ, రానా సహా పలువురి పేర్లు వినిపించాయి. కానీ వాళ్లెవరూ కాకుండా ఎవరూ ఊహించని విధంగా మంచు విష్ణు బిగ్ బాస్ ఏడో సీజన్‌కు ఎంపికైనట్టు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 2017లో బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. తన మాటల గారడీతో ఎన్టీఆర్ ఈ సీజన్‌ను ఇంటింటికీ తీసుకెళ్లాడు. దీంతో అదిరపోయే టీఆర్పీ వచ్చేసింది. రెండో సీజన్‌లో హోస్ట్‌గా ఎన్టీఆర్‌కు బదులు నాని వచ్చాడు. కానీ ఎన్టీఆర్ యాంకరింగ్ ముందు నాని తేలిపోయాడు. ఫస్ట్ సీజన్‌తో కంపేర్ చేసినప్పుడు ఆడియన్స్ చూడలేకపోయారు. టీఆర్పీ కూడా దారుణంగా పడిపోవడంతో మూడో సీజన్‌కు నాగార్జునను రంగంలోకి దించాడు బిగ్‌బాస్. నాగార్జున చేతిలోకి వచ్చిన తర్వాత బిగ్‌బాస్ సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీఆర్పీలపరంగా కూడా దూసుకెళ్లింది.దీంతో ఆరో సీజన్ వరకు నాగార్జుననే బిగ్‌బాస్ హోస్ట్ చేశాడు. బిగ్‌బాస్ షో అంటే నాగార్జుననే అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆరో సీజన్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు నాగార్జునకు నచ్చలేదు. దీంతో బిగ్‌బాస్ షోకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నట్టు వార్తలు మొదలయ్యాయి.

బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్టు దాదాపు కన్ఫార్మ్ కావడంతో తదుపరి సీజన్‌కు హోస్ట్ ఎవరనే చర్చలు మొదలయ్యాయి. మొదట విజయ్ దేవరకొండ హోస్ట్ చేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆరే మళ్లీ వస్తున్నాడని ప్రచారం జరిగింది. కాకపోతే వీళ్లిద్దరూ కాకుండా అన్‌స్టాపబుల్ షోతో దూసుకెళ్తున్న బాలయ్య.. బిగ్‌బాస్ కోసం రంగంలోకి దిగబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే నాగార్జున మాత్రం హోస్ట్‌గా దగ్గుబాటి రానా పేరును సూచించారని కూడా ప్రచారం నడిచింది. దీంతో బాలయ్య లేదా రానా ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్‌బాస్ తదుపరి సీజన్‌ను హోస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెరపైకి వచ్చాడు. ఇప్పటికే మంచు విష్ణును బిగ్‌బాస్ టీమ్ సంప్రదించారని టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే హోస్ట్‌గా మంచు విష్ణు ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Exit mobile version