Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsEmoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

Emoji | మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. మన మనసులో ఉన్న ఫీలింగ్‌ను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేందుకు ఇది చక్కగా పనికొస్తుంది. అందుకే ఎమోజీలు అందరి మనసుల్నీ దోచేశాయి. 19వ శతాబ్దం నుంచే ఈ ఎమోజీలు వాడుకలోకి వచ్చినప్పటికీ.. ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌లు వచ్చిన తర్వాతే వీటి వినియోగం పెరిగింది. ఇప్పుడు ఇక ఈ జనరేషన్‌లో అయితే ఎమోజీలు మనతో మమేకమైపోయాయి. మరి అంతలా జనాలకు అలవాటు అయిన ఎమోజీలు ఎప్పుడు పుట్టాయి? ఎలా వాడుకలోకి వచ్చాయి? ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? వంటి ఆసక్తికర విషయాలు ఒకసారి చూద్దాం..

ఎమోజీల చరిత్ర

అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ టైమ్‌లో ఈ ఎమోజీలు పుట్టుకొచ్చాయి. 1862లో ఓ మీటింగ్‌లో పాల్గొన్న లింకన్‌.. ప్రసంగం చేసేటప్పుడు ఇచ్చిన హావభావాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కన్నుగీటడం బాగా పాపులర్‌ అయ్యింది. అది ఎంతగా పాపులర్‌ అయ్యిందంటే.. మరుసటి రోజు పేపర్‌లో లింకన్‌ ప్రసంగంతో పాటు కన్నుగీటే ఎమోజీని కూడా ముద్రించారు. ఇలా ఎమోజీల పుట్టుకొచ్చాయని చెబుతుంటారు.

ట్రెండ్‌ ఇలా మొదలైందని మరో కథనం

1963 సమయంలో స్టేట్‌ మ్యూచ్‌వల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ కంపెనీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ సమయంలో ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇది గమనించిన కంపెనీ యాజమాన్యం.. ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపాలని అనుకుంది. ఇందుకోసం ఒక గ్రాఫిక్‌ డిజైనర్‌ను నియమించింది. అతను ఒక స్మైలీ ఎమోజీని రూపొందించారు. అందరూ సంతోషంగా ఉండాలని సింపుల్‌గా చెప్పాడు. ఆ స్మైలీకి సంతోషానికి సంకేతమైన పసుపు రంగును అద్దాడు. అది ఆ కంపెనీ ఉద్యోగుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. అప్పట్నుంచి సంతోషంగా ఉండాలని చెప్పేందుకు ఈ స్మైలీ ఎమోజీని వాడటం మొదలు పెట్టారు. అయితే కాలక్రమంలో ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల ఎమోజీలు పుట్టుకొచ్చాయి.

ఇక సోషల్‌మీడియాలో ఎమోజీలను యాహూ ప్రవేశపెట్టింది. యూహూ మెయిల్‌, యాహూ మెసెంజర్‌ల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక జపనీస్‌ టెలికం సంస్థ ఎన్‌టీటీ డొకామోలో పనిచేసిన షిగెటకా కురిటా 1999లో ఎమోజీలను మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ కోసం అభివృద్ధి చేశారు. స్మార్ట్‌ఫోన్లు ప్రజల జీవితాల్లోకి వచ్చిన తర్వాత అంటే.. 2010లో ఎమోజీలు ప్రాచుర్యం చెందాయి. 176 ఎమోజీలతో ప్రారంభమైన ఈ భాష.. ఇప్పుడు 3533 ఎమోజీలకు చేరింది.

పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి

పసుపు రంగు ఆనందంతో ముడిపడి ఉంటుంది. అలాగే శ్రద్ధ, సానుకూలతను కూడా ఇది తెలియజేస్తుంది. అందుకే పసుపు రంగునే ఎమోజీలకు వాడుతుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News