Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsCRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

CRED CEO | ఇవాళ రేపు చిరుద్యోగి కూడా రూ.20వేల వరకు సంపాదిస్తున్నాడు. అలాంటిది ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయితే అతని జీతం ఎంత ఉంటుందో ఆలోచించండి. కనీసం కోట్లలో ఉంటుంది. అది కూడా చాలా తక్కువే అనే ఫీలవుతుంటారు. అలాంటిది ఫిన్ టెక్ కంపెనీ అయిన క్రెడ్ సీఈవో జీతం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

అంతలా ఆశ్చర్యపోవడానికి ఏముంటుందని అనుకుంటున్నారా? ఎందుకంటే అతని జీతం కోట్లలో లేదు. కనీసం లక్షల్లో కూడా శాలరీ తీసుకోవట్లేదు. క్రెడ్ సీఈవో జీతం కేవలం రూ.15వేలు మాత్రమే. ఒక్క సీఈవో జీతం ఎందుకు అంత తక్కువగా ఉంటుందని సందేహిస్తున్నారు కదూ.. కానీ ఇది నిజం.. ఈ విషయాన్ని క్రెడ్ సీఈవో కునాల్ షానే స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ ఎనీథింగ్ కార్యక్రమం నిర్వహించిన క్రెడ్ ఫౌండర్ కునాల్ షా‌ను ఓ నెటిజన్ శాలరీ గురించి అడిగాడు. నెలకు మీ శాలరీ ఎంత అని కునాల్‌ను అడగ్గా.. రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని చెప్పి షాకిచ్చాడు.

కునాల్ షా జవాబుతో ఆశ్చర్యపోయిన మరో నెటిజన్ ‘‘అంత తక్కువ జీతంతో మీరు ఎలా జీవిస్తున్నారు?’’ అని ప్రశ్నించాడు. క్రెడ్ సంస్థ లాభాల్లోకి వచ్చే దాకా ఇంతే జీతం తీసుకుంటానని కునాల్ బదులిచ్చాడు. అప్పటిదాకా ఫ్రీఛార్జ్‌ను విక్రయించిన డబ్బులు సరిపోతాయని చెప్పుకొచ్చాడు. ఇది విని అంతా షాకవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ జీతానికే పనిచేస్తున్నాడని కునాల్‌ను కొంతమంది ప్రశంసిస్తుంటే.. పన్ను ఆదా చేసుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News