Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsElon Musk | చాట్‌ జీపీటీ కి పోటీగా రంగంలోకి దిగిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకు...

Elon Musk | చాట్‌ జీపీటీ కి పోటీగా రంగంలోకి దిగిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకు ?

Elon Musk | ఇప్పుడు ఏ ఐటీ సంస్థ నోట విన్నా.. చాట్‌ జీపీటీ గురించే. ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ ట్రెండింగ్‌లో ఉంది. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. చాట్‌ జీపీటీకి మూలమైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు పెడితే.. గూగుల్‌ చాట్‌ జీపీటీ లాంటిదే కొత్తగా బార్డ్‌ అనే ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తోంది. మెటా, స్నాప్‌ చాట్ వంటి సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఏఐ చాట్‌బాట్‌ లాంటి సేవలను అందించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

వీటిన్నంటికీ పోటీగా నేను కూడా ఉన్నా అంటూ ఈ రేసులోకి ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌ చేరిపోయారు. ఈయన కూడా చాట్‌ జీపీటీ తరహాలో ఏఐ ఆధారిత కొత్త టూల్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన ఇప్పటికే సాంకేతిక నిపుణులతో మంతనాలు కూడా జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మస్క్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం గూగుల్ మాజీ ఉద్యోగిని ఇగోర్‌ బాబుష్కిన్‌ నియమించిన్నట్లు వినికిడి. ఈయన ఇంతకు ముందు గూగుల్‌ డీప్‌ మైండ్‌ ఏఐ యూనిట్ లో వర్క్‌ చేశారు. మస్క్‌ దీని కోసం 2015లోనే ఓపెన్‌ ఏఐ శామ్‌ ఆల్టమన్‌ బృందం స్థాపించినప్పుడు పెట్టుబడులు పెట్టాడు. కానీ ఏమైందో ఏమో 2018లో మస్క్‌ దీని నుంచి తప్పుకున్నాడు.

ఆ సమయంలో ఏఐ అణుబాంబు కంటే ప్రమాదకరమని మస్క్‌ అన్నారు కూడా, అంతేకాదు గత సంవత్సరం డిసెంబరులో కూడా ఏఐ ఓ భయానక అనుభవం అని మస్క్‌ ట్వీట్ చేశాడు. ఐదేళ్ల క్రితం ఏఐకి వ్యతిరేకంగా ఉన్న మస్క్‌.. ఇప్పుడు అదే తరహా టూల్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవడం పై సాంకేతికత రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల టెస్లా పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో సైతం మస్క్‌ ఏఐ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో కార్లను ఏఐ నిర్మిస్తుందని నేను అనుకోవడం లేదు.. ఒకవేళ అదే జరిగితే మనమంతా పనిచేయడం దండగే అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక మస్క్‌ ప్రవేశపెట్టబోయే ఏఐ చాట్‌బాట్‌కు బేస్డ్ ఏఐ, వోక్‌ ఏఐ లేదా క్లోజ్డ్‌ ఏఐ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News