Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentvijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

vijay antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. మలేసియాలో పిచ్చైకారన్ 2 ( బిచ్చగాడు 2 ) చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ ప్రయాణిస్తున్న వాటర్ బోట్ అదుపుతప్పి.. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న మరో బోట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హీరోకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ కొనసాగుతోందని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా ప్రమాదం గురించి తెలియగానే విజయ్ ఆంటోనీ కుటుంబసభ్యులు మలేసియా బయల్దేరి వెళ్లారు.

కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ నాన్ (నకిలీ) సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పిచ్చైకారన్ (బిచ్చగాడు ) సినిమాతో తెలుగునాట కూడా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది. అప్పట్నుంచి విజయ్ ఆంటోనీ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. ఈ క్రమంలోనే 2016లో వచ్చిన పిచ్చైకారన్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా మారుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం హీరోగా విజయ్ ఆంటోని చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, పిచ్చైకారన్ 2, కోలై, రథం, మజై పిడిక్కత మనితన్, వల్లి మయిల్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News