Pallavi Joshi | టైమ్2న్యూస్, హైదరాబాద్ : ది కశ్మీర్ ఫైల్స్ నటి పల్లవి జోషి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లో ది వ్యాక్సిన్ వార్ సినిమా చిత్రీకరణ సమయంలో అదుపుతప్పి ఓ వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అతయినప్పటికీ ఆ గాయాలతోనే పల్లవి జోషి షూటింగ్‌లో పాల్గొంది. ఆ వెంటనే పల్లవి జోషికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.
అన్నట్టు పల్లవి జోషి భర్త ఎవరో కాదు.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు, నిర్మాత వివేక్ అగ్నిహోత్రినే. ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి కూడా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి పల్లవి జోషి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ కూడా ఈ షెడ్యూల్‌లోనే ది వ్యాక్సిన్ వార్‌లో భాగమైంది. ఈ షూటింగ్ స్పాట్‌లోనే పల్లవి జోషి ప్రమాదానికి గురైంది.
షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డ బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

మరోవైపు బిచ్చగాడు 2 ( పిచ్చైకారన్ 2) సినిమా షూటింగ్ స్పాట్‌లో కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీకి తీవ్రగాయాలు అయ్యాయి. మలేసియాలోని సముద్రంలో షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బోట్ అదుపు తప్పి.. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న పెద్ద బోట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం