Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest Newsflying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

flying bike | ఇప్పటివరకు రోడ్లపై రయ్‌.. రయ్‌ మంటూ దూసుకెళ్లిన బైకులు ఇప్పుడు గాల్లో కూడా అదే స్పీడ్‌తో దూసుకెళ్లబోతున్నాయి. తొందరలోనే గాల్లో ఎగిరే బైక్‌ రాబోతుంది. అమెరికాకు చెందిన జెట్‌ ప్యాక్‌ ఏవియేషన్‌ కంపెనీ ఈ ఫ్లయింగ్‌ బైక్‌ను తయారు చేసింది. ఈ XTurismo బైక్‌ కొనుగోలుకు సంబంధించి అప్పుడే బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ బైక్‌కు సంబంధించిన నమూనా చిత్రాలను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ నమూనా డిజైన్‌లో బైక్‌కు నాలుగు దిక్కుల నాలుగు జెట్‌ టర్బైన్‌ ఇంజిన్లు ఉన్నాయి. అయితే బైక్‌ లాంఛయ్యే సరికి 8 టర్బైన్‌ ఇంజిన్లు ఉంటాయని చెబుతున్నారు. అంటే నాలుగు మూలల్లో రెండేసి చొప్పున జెట్‌ ఇంజిన్లు ఉంటాయి. బైక్‌ గాల్లో ఎగురుతున్నప్పుడు రైడర్‌కు రక్షణగా కూడా ఉంటాయి.

ఇదీ flying bike స్పెషాలిటీ..

ఈ ఫ్లయింగ్‌ బైక్‌కు స్పీడర్‌ ( Speeder ) అని పేరు పెట్టారు. ఇది గంటకు 96 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాల పాటు గాల్లో ఎగురుతుంది. 136 కిలోల బరువు ఉన్న ఈ ఫ్లయింగ్‌ బైక్‌ 272 కిలోల వరకు బరువును మోయగలదు. ఈ బైక్‌ గరిష్ఠంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 16 వేల అడుగుల ఎత్తు వరకు కూడా ఈ బైక్‌ ఎగురగలదు. కానీ అంతపైకి వెళ్లేసరికి బైక్‌లో ఉన్న ఇంధనం అయిపోతుంది. అప్పుడు రైడర్‌ నేలపైకి రావాలంటే ప్యారాచూట్‌ అవసరం అవుతుందని జెట్‌ప్యాక్‌ సంస్థ చెబుతోంది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.3.18 కోట్లుగా నిర్ణయించారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ బైక్స్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వీడియో గేమ్‌ ఆడినట్టే ఆపరేటింగ్‌

ఈ బైక్‌ గాల్లో ఎగిరేందుకు యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఫ్లై బై వైర్‌ టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని వీడియో గేమ్స్‌ మాదిరిగా హ్యాండ్‌ గ్రిప్‌లో ఉండే బటన్స్‌ ద్వారా నియంత్రించవచ్చు. వీటిని బైక్‌ టేకాఫ్‌ అవ్వడానికి, ల్యాండ్ చేయడానికి, ఎత్తుకు వెళ్లడానికి, స్పీడ్‌గా వెళ్లేందుకు ఉపయోగించవచ్చు.

యాక్సిడెంట్ల నియంత్రణకు ప్రత్యేక సెన్సార్లు

గాల్లో వేగంగా దూసుకెళ్లినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఇందులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. బైక్‌ గాల్లో ఎగురుతున్న సమయంలో దాని దిశకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుంది. అలాగే ఎదురుగా ఏదైనా చెట్టు, భవనం వస్తే వాటిని ఢీకొనకుండా తప్పించేందుకు ప్రత్యేక సెన్సార్లను కూడా వీటి తయారీలో ఉపయోగించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Uber ride via Whatsapp | ఇక వాట్సాప్‌లోనే ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News