Home Latest News Virat Kohli | విరాట్ కోహ్లీ మాటలే మంత్రాలుగా.. బెంగళూరు మహిళల జట్టు బోణీ వెనుక.....

Virat Kohli | విరాట్ కోహ్లీ మాటలే మంత్రాలుగా.. బెంగళూరు మహిళల జట్టు బోణీ వెనుక.. కోహ్లీ స్పెషల్ మెసేజ్

Virat Kohli | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. జట్టులో విరాట్ కోహ్లీ స్ఫూర్తి నింపాడు. తొలిసారి మహిళల కోసం నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధన కెప్టెన్సీలో బెంగళూరు బరిలోకి దిగింది. తొలి ఐదు మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ జట్టు సభ్యులతో ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా ముచ్చటించాడు. డబ్ల్యూపీఎల్‌లో బుధవారం యూపీ వారియర్స్ తో మ్యాచ్‌కు ముందు బెంగళూరు జట్టుతో విరాట్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. బెంగళూరు తరఫున తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, విమర్శలను కోహ్లీ.. మహిళల జట్టుతో పంచుకున్నారు. ఎన్ని పరాజయాలు ఎదురైనా ఉత్సాహం కోల్పోకుండా ఎలా ముందుకు సాగుతున్నాడో వివరించాడు. ‘నేను 15 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాను. ఆరంభం నుంచి బెంగళూరు జట్టు తరఫునే ఆడాను. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మన జట్టు ఐపీఎల్ విజేతగా నిలువలేకపోయింది. అయినా ఏ రోజు నిరుత్సాహ పడలేదు. ప్రతి ఏటా అదే ఉత్సాహంగా టోర్నీలో పాల్గొంటాను ప్రతి మ్యాచ్, ప్రతి సీజన్‌లో శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని కోహ్లీ అన్నాడు.

కోహ్లీ మాటల స్ఫూర్తితో బుధవారం డబ్లూ్యపీఎల్లో బెంగళూరు జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. యూపీ వారియర్స్ తో జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదు పరాజయాలతో అనంతరం గెలుపు రుచిచూసింది. మ్యాచ్‌కు ముందు విరాట్ చెప్పిన మాటలు తమపై మంత్రంలా పనిచేశాయని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన కనిక అహుజా పేర్కొంది. ‘ప్రతి సంవత్సరం కప్ సాధిస్తామనే గ్యారంటీ ఇవ్వలేకపోయినా.. నాణ్యమైన ఆటను మాత్రం చూసేలా చేస్తామని అభిమానులకు 110 శాతం గ్యారంటీ ఇవ్వగలం. ఫలితాల గురించి ఆలోచించకుండా.. విజయాల కోసం ముందుకు సాగాలి. ఒత్తిడిని అధిగమించడం ముఖ్యం. అభిమానులు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారనే విషయాన్ని మరవొద్దు. మహిళల ప్రీమియర్ లీగ్ రూపంలో చక్కటి అవకాశం వచ్చింది. ఆటను ప్రేమిస్తూ స్వేచ్ఛగా ముందుకు సాగంది. ఇప్పటికీ మీ చేతుల నుంచి అవకాశం దాటి పోలేదు. ఇంకా తలుపుతు తెరిచే ఉన్నాయి’ అని విరాట్ జట్టు సభ్యులకు సూచించాడు. ఇక ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. పదిహేను సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మ్యాక్స్వెల్, డుప్లెసిస్ వంటి ఎందరో మేటి ఆటగాళ్లు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించినా.. బెంగళూరు అదృష్టం మాత్రం మారలేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్-16వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఈ సారైనా బెంగళూరు అభిమానులు ‘ఈ సాలా కప్ నమదే’ అంటారేమో వేచి చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version