Home Entertainment Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Junior NTR | ఆల్రెడీ ఒక సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించారంటే ఫ్యాన్స్ మధ్య రచ్చ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ ఆర్ రెగ్యులర్ మొదలైన రోజు నుంచి ఇదే జరుగుతుంది. ఒక వైపు రామ్ చరణ్.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గొప్ప అంటూ కొట్టుకు చస్తున్నారు. తాజాగా సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా వాళ్ల పీకులాట మాత్రం ఆగడం లేదు. అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ చూసి.. మిమ్మల్ని ఎవడు మార్చలేడురా అంటూ కామెంట్స్ గట్టిగానే పడుతున్నాయి.

ఓ వైపు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని అందుకుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గొప్ప అంటూ చెప్పుకోవడం ఏంట్రా బాబు మీ పిచ్చ కాకపోతే అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్ వార్ మరింత ఊపు అందుకోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని తెలిస్తే చాలా మందికి షాక్ తప్పదు. ఎందుకంటే ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత ఒక ఆనందంతో ఒక ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అందులో కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్ ఇలా అందరి గురించి చెప్పిన ఎన్టీఆర్.. రామ్ చరణ్ గురించి చెప్పడం మర్చిపోయాడు.

కనీసం అతడి పేరు ట్యాగ్ కూడా చేయలేదు. దాంతో అక్కడే మొదలైంది అసలు ఫ్యాన్ వార్.
మరోవైపు రామ్ చరణ్ చేసిన ట్వీట్లో తారక్ పేరు మర్చిపోలేదు. అందరిని గుర్తు పెట్టుకొని థ్యాంక్యూ చెప్పాడు. మనం గెలిచాము.. మేం గెలిచాం.. మన దేశం గెలిచింది అంటూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్ పేరు మర్చిపోయాడు. దాంతో పడగెత్తిన ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోశాడు జూనియర్.

సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. మా హీరో అందరిని గుర్తు పెట్టుకొని పేరు పేరునా పలకరిస్తే.. మీ హీరో మాత్రం మా హీరోను మర్చిపోయాడు అంటూ తారక్ ఫ్యాన్స్ పై రామ్ చరణ్ అభిమానులు మండి పడుతున్నారు. జూనియర్ కావాలని చేశాడా లేదంటే అనుకోకుండా మర్చిపోయారా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు కానీ.. ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ తో ఫ్యాన్ వార్ రెక్కలు విప్పుకుంది. మరి దీన్ని ఎలా తగ్గిస్తారో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com

TSPSC Group 1 Question Paper Leak | గ్రూప్ 1 పేపర్‌ కూడా లీక్ అయిందా.. నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయి ?

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Exit mobile version