Home Latest News DC vs GG | జేజమ్మ పోరాటం వృథా.. ఢిల్లీని గెలిపించలేకపోయిన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి

DC vs GG | జేజమ్మ పోరాటం వృథా.. ఢిల్లీని గెలిపించలేకపోయిన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి

DC vs GG | టైమ్ 2 న్యూస్, ముంబై: అదేంటి జేజమ్మ ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించలేకపోవడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా? మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. పేస్ బౌలర్‌గా జట్టులో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ.. గురువారం రాత్రి బ్యాట్‌తో విజృంభించింది. జట్టుకు అవసరమైన దశలో చెలరేగి ఆడుతూ.. ఢిల్లీని విజయానికి చేరువ చేసింది. 148 పరుగుల లక్ష్యఛేదనలో జట్టు 97/7తో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అరుంధతి రెడ్డి.. ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అవతలి ఎండ్లో వికెట్లు పడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గని అరుంధతి.. నాలుగు ఫోర్లు కొట్టి ఢిల్లీని విజయానికి చేరువ చేసింది. అరుంధతి ధాటికి గుజరాత్‌కు ఓటమి భయం చుట్టుకోగా.. ఒక దశలో ఢిల్లీ.. 13 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే 18వ ఓవర్ చివరి బంతికి మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అరుంధతి.. స్నేహ్ రాణాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం చివరి వికెట్ను సులువుగా పడగొట్టిన గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గార్డ్నర్, వాల్వర్ట్ అర్ధశతకాలు..

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లార్ వాల్వర్ట్ (45 బంతుల్లో 57; 6 ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డ్నర్ (33 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా.. హర్లీన్ డియోల్ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు) సత్తాచాటింది. ఢిల్లీ బౌలర్లలో జెస్ జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. మరినె కాప్ (36) టాప్ స్కోరర్ కాగా.. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఆఖరి వరకు పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో గార్త్, గార్డ్నర్, తునూజ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో శుక్రవారం విరామం కాగా.. శనివారం డబుల్ హెడర్ జరుగనుంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్‌ యూపీ వారియర్స్, రెండో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version