Home Latest News TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌...

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

TSPSC | గ్రూప్‌ 1 మెయిన్స్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి స్పందించారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. నివేదిక వచ్చిన తర్వాత అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనార్ధన్‌ రెడ్డి.. నమ్మిన వాళ్లే గొంతు కోశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి దొంగలను పట్టుకోలేకపోయామంటూ చెప్పుకొచ్చారు. దురదృష్టకరమైన వాతావరణంలో మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని.. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను అరికట్టేందుకే మాట్లాడాల్సి వచ్చిందన్నారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్షల లీకుల వ్యవహారంలో కీలక నిందితుడైన ప్రవీణ్‌కు గ్రూప్-‌1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనని జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అయితే 103 మార్కులు మాత్రమే అత్యధికం కాదని అన్నారు. కీలకమైన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై పోలీసులు చాలా వేగంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికే ఈ లీకేజీలో ప్రమేయం ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేశారని, వారిలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులైన ప్రవీణ్‌, రాజశేఖర్ తో పాటు గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త ఉద్యోగాలు పోతాయన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ జూన్‌ 5 నుంచే యధాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

దేశంలోనే తొలిసారిగా ఎక్కడాలేని విధంగా మల్టిపుల్‌ జబ్లింగ్‌ పద్ధతిని గ్రూప్‌ 1 పరీక్షల్లో అనుసరించామన్నారు. అక్రమాలు జరగొద్దనే ఈ జాగ్రత్తలు తీసుకున్నామని జనార్ధన్‌ రెడ్డి చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 26 నోటిఫికేషన్లు ఇచ్చామని ఇందులో 7 పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఎనిమిదో పరీక్షగా టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ జరగాల్సి ఉందన్నారు. 173 పోస్టులకు 33వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, 12న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 11న పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. కాన్ఫిడెన్షియల్‌ సిస్టమ్‌ నుంచి ఇన్ఫర్మేషన్‌ ఎవరో హ్యాక్‌ చేసి, దుర్వినియోగం చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత రెండు రోజులు విచారణ జరిపి, తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌ సాయంతో ఏఎస్‌ఓ ప్రవీణ్ పేపర్లు లీక్ చేశాడని, రూ.10 లక్షల కోసం పేపర్లు విక్రయించినట్లు తెలిసిందన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com

TSPSC Group 1 Question Paper Leak | గ్రూప్ 1 పేపర్‌ కూడా లీక్ అయిందా.. నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు ఎలా వచ్చాయి ?

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Exit mobile version