Home News International Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Image Source : Rohit Sharma Facebook

Rohit Sharma | టైమ్‌ 2 న్యూస్‌, నాగ్‌పూర్‌: ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లు ఉంది ఆస్ట్రేలియా పరిస్థితి.. టెస్టు సిరీస్‌ ప్రారంభం కాకముందే కంగారూలు పిచ్‌పై పిచ్చి వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆసీస్‌ మాజీలు భారత పిచ్‌లపై తిక్క వ్యాఖ్యానాలకు తెరతీయగా.. ఇప్పుడు తాజాగా ఆ జట్టు ఆటగాళ్లు కూడా అదే పాట పాడుతున్నారు.

మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు నాగ్‌పూర్‌ పిచ్‌ను పరిశీలించిన ఆసీస్‌ ఆటగాళ్లు.. టీమిండియాకు లబ్ది చేకూరేలా స్పిన్‌ పిచ్‌ను తయారు చేయించుకుంది అని వ్యాఖ్యానించారు. గత రెండు పర్యాయాలు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో అసలు పిచ్‌ ఏదో, గ్రౌండ్‌ ఏదో కూడా అర్థంకానంతగా పచ్చికతో నిండిన పిచ్‌లు దర్శనమిచ్చాయి. అయినా పల్లెత్తు మాట అనని టీమిండియా.. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఆసీస్‌ గడ్డపవై వరుసగా రెండు పర్యటనల్లో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

అయితే చాన్నాళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇలా ఉపఖండంలోని పిచ్‌లన్నీ దాదాపు స్పిన్‌కు అనుకూలించడం దశాబ్దాలుగా వస్తున్నదే అయినా.. ఇప్పుడే కొత్తగా ఆసీస్‌ను పడగొట్టేందుకే స్పిన్‌ పిచ్‌లు తయారు చేయించినట్లు మాట్లాడటం విడ్డూరంగా కనిపిస్తోంది. అసలు సిరీస్‌ ప్రారంభం కాకుండానే ఈ వివర్శలు చేయడం సరికాదని.. పిచ్‌లపై పడి ఏడ్వడం ఆపి.. ముందు బరిలోకి దిగి సత్తాచాటమని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

గిల్‌, సూర్యలో ఒక్కరికే చాన్స్‌!

ఇటీవలి కాలంలో టెస్టు మ్యాచ్‌ ప్రారంభానికి ఒక రోజు ముందే ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటిస్తున్న టీమిండియా.. ఈసారి మాత్రం మ్యాచ్‌ రోజే తుది పదకొండు మంది జాబితా విడుదల చేయనుంది. యువ ఆటగాళ్లు ఫుల్‌ జోష్‌లో ఉండటం జట్టు ఎంపికపై మేనేజ్‌మెంట్‌ తీవ్రంగా శ్రమిస్తున్నది. ప్రతిష్ఠాత్మక సిరీస్‌ కావడంతో ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నది.

సొంతగడ్డపై జరుగనున్న ఈ సిరీస్‌ నెగ్గితే వరుసగా నాలుగుసార్లు ‘బోర్డర్‌-గవాస్కర్‌’ ట్రోఫీ నెగ్గిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లోకెక్కనుంది. దీంతో సిరీస్‌ 2-0 లేదా అంతకంటే మెరుగైన ఫలితంతో దక్కించుకోగలిగితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించనుంది.

ఈ నేపథ్యంలో బుధవారం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘రేపు ఉదయం 9 గంటలకు టాస్‌. అప్పుడే తుది జట్టు గురించి వెల్లడిస్తాం. ఇది క్లిష్టమైన స్థితి. యువ ఆటగాళ్లంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. అందులో నుంచి 11 మందిని ఎంపిక చేయడం కష్టమే. అయితే ఇలాంటి పోటీతత్వం ఉండటం జట్టుకు మంచి చేస్తుంది. అత్యుత్తమమైన 11 మందే మైదానంలో దిగుతారు. పరిస్థితులకు తగ్గటే జట్టు ఎంపిక ఉటుందని అందరికీ చెప్పాం. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇక సూర్యకుమార్‌ పొట్టి ఫార్మాట్‌లో దంచి కొడుతున్నాడు. అతడు టెస్టు క్రికెట్‌లోనూ సత్తాచాటగలడు. ఇద్దరూ నైపుణ్యం ఉన్న వాళ్లే. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకొనే తుది జట్టును ఎంపిక చేస్తాం’ అని అన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Vinod Kambli | క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వినోద్‌ కాంబ్లీ

Suresh Raina | ఆసీస్‌ నిర్ణయం ఆశ్చర్యపరిచింది: సురేశ్‌ రైనా

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Exit mobile version