Home Latest News Steve Smith | స్మిత్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ.. కండ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న...

Steve Smith | స్మిత్‌ క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ.. కండ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న ఆసీస్‌ కెప్టెన్‌.. వీడియో వైరల్

Steve Smith | టైమ్‌ 2 న్యూస్‌, విశాఖపట్నం: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అద్భుతం చేశాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్‌ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. అబాట్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో ఆప్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని పాండ్యా కట్‌ చేయబోగా.. ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ కండ్లు చెదిరే రితిలో క్యాచ్‌ అందుకున్నాడు. పక్షిలా కుడి వైపు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో రెప్పపాటులో బంతిని ఒడిసి పట్టాడు. మ్యాచ్‌ అనంతరం దీనిపై స్పందించిన స్మిత్‌ ‘క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ అనుకోవడం లేదు కానీ, హార్దిక్‌ వంటి ప్రధాన ప్లేయర్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఆనందమేసింది’ అని అన్నాడు.

అచ్చొచ్చిన మైదానంలో మనవాళ్లు సత్తాచాటి మరో మ్యాచ్‌ మిగిలుండగానే వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంటారనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా పేలవ ప్రదర్శన కనబర్చారు. ఆసీస్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరిగే బంతులకు మనవాళ్లు క్రీజులో నిలువలేకపోయారు. వర్షం కారణంగా మ్యాచ్‌ సజావుగా సాగుతుందో లేదో అనుకున్న అభిమానులు.. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చూశాక.. వరుణుడు కరుణించి మ్యాచ్‌ను తుడిచిపెట్టేస్తే బాగుండు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు! పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు ఒకరి వెంట ఒకరు డగౌట్‌కు క్యూ కట్టగా.. మార్ష్‌, హెడ్‌ దంచికొట్టడంతో కంగరూలు వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఊదేశారు!

https://twitter.com/ZaheerK30866428/status/1637401153066467334?s=20

మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. గత రెండు దశాబ్దాల్లో ఆసీస్‌పై టీమ్‌ఇండియాకు ఇది అత్యల్ప స్కోరు. విరాట్‌ కోహ్లీ (31) టాప్‌ స్కోరర్‌ కాగా.. అక్షర్‌ పటేల్‌ (29 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. వైజాగ్‌లో చక్కటి రికార్డు ఉన్న కోహ్లీ ఒంటరి పోరాటం చేసే ప్రయత్నం చేయగా.. మరో ఎండ్‌లో భారత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ (5/53) ధాటికి టీమ్‌ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ బౌలర్లలో అబాట్‌ 3, ఎలీస్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 51 నాటౌట్‌; 10 ఫోర్లు), మిషెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 66 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టారు. స్టార్క్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం చెన్నైలో జరుగనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rain Alert | వాతావరణ శాఖ అలర్ట్‌.. తెలంగాణలో మరో 2 రోజులు, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు

YS Jagan | టీడీపీ, జనసేన పొత్తులపై ఏపీ సీఎం జగన్‌ ఇండైరెక్ట్‌గా పంచులు.. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు !

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version