Home Latest News Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | డంప్‌ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినందుకు గానూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ ) ఆ మున్సిపల్ కార్పొరేషన్‌ పై ఏకంగా 100 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొచ్చిలోని చెత్త డంప్‌ ప్రదేశంలో అగ్ని ప్రమాద ఘటన పై నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌ కఠిన చర్యలు తీసుకుంది. అంతేకాకుండా వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పై ఎన్‌జీటీ ఏకంగా రూ.100 కోట్ల నష్టపరిహారాన్ని విధించింది. ఈ అగ్ని ప్రమాదం మార్చి 2 వ తేదీన సంభవించింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భారీగా పొగ వ్యాపించింది.

దీంతో కొచ్చి నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవి అత్యంత విషపూరిత వాయువులు కావడంతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే ఇళ్ల వద్ద నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మాస్కులు కూడా ధరించాలని కోరారు. మరో వైపు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులను అత్యవసరంగా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొన్నారు.

మరో వైపు ఆ చెత్త డంప్‌లో మంటలను ఆర్పేందుకు నేవీ సిబ్బంది తో పాటు 30 అగ్ని మాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. మరో వైపు హెలికాప్టర్లను కూడా వినియోగించి చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో మార్చి 5 నాటికి మంటలను పూర్తిగా నియంత్రించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ జీటీ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆ క్రమంలో చెత్త కుప్పల వద్ద అగ్ని ప్రమాదాలను నిరోధించడంలో విఫలమైన కొచ్చి కార్పొరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 15 ప్రకారం పర్యావరణ నష్టానికి గాను రూ.100 కోట్లను చెల్లించాలని వెల్లడించింది.

నెల రోజుల్లోగా ఆ నగదును కేరళ చీఫ్ సెక్రటరీకి జమ చేయాలని తెలిపింది. పర్యావరణానికి, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యర్థాల నిర్వహణ విషయంలో చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడుతోందని ఎన్జీటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాలనలో ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version