Home Entertainment Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.....

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Naatu Naatu | దర్శకుధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు అయితే మనోళ్లే కాదు విదేశీయులు కూడా ఫిదా అయ్యారు. సెలబ్రెటీలు సైతం ఈ పాటకు కాలు కదుపుతూ రీల్స్‌ చేశారు. సినిమా విడుదలైనప్పటిటి నుంచీ నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఈ సాంగ్‌కు అంత క్రేజ్‌ ఉంది కాబట్టే ఆస్కార్‌ కూడా వరించింది. అంతగా పాపులర్‌ అయిన ఈ సాంగ్‌పై బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే కరీనా కపూర్‌ పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేస్తోంది. వాట్‌ ఉమెన్‌ వాంట్‌ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కరీనా.. ఈ షోలోనే నాటు నాటు సాంగ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. చిన్న పిల్లల మనసు సైతం ఈ పాట కొల్లగొట్టింది. నా చిన్న కొడుకు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినట్లేదు. అది కూడా తెలుగులోనే వినడానికి ఇష్టపడుతున్నాడు.

జెహ్ కి ఆ పాట బాగా నచ్చింది. ఆ పాట వినపడినప్పుడల్లా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఆస్కార్ గెలిచిన పాట ప్రేక్షకులను ఎంతగా మ్యాజిక్ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని తెలిపింది. దీంతో కరీనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాటు నాటు పాట వినపడందే తన కొడుకు అన్నం తినట్లేదు అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version