Home Latest News Actor Nani | విరాట్‌ కోహ్లీ.. ‘గ్యాంగ్‌ లీడర్‌’, హార్దిక్‌ పాండ్యా.. ?.. టీమిండియా క్రికెటర్లకు...

Actor Nani | విరాట్‌ కోహ్లీ.. ‘గ్యాంగ్‌ లీడర్‌’, హార్దిక్‌ పాండ్యా.. ?.. టీమిండియా క్రికెటర్లకు పేర్లు పెట్టిన నాని

Actor Nani | టైమ్‌ 2 న్యూస్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభానికి ముందు వైజాగ్‌ స్టేడియంలో సినీ నటుడు నాని హల్‌చల్‌ చేశాడు. అతడు నటించిన దసరా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆదివారం మ్యాచ్‌కు నాని హజరయ్యాడు. సినిమాలో తన పాత్ర పేరు సూచించే విధంగా.. ‘ధరణి’ పేరిట ప్రత్యేక జెర్సీతో దర్శనమిచ్చిన నాని.. కామెంటేటర్లతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ప్లేయర్లకు తన సినిమా పేర్లను ఆపాదించి సందడి చేశాడు.

తన సినిమాల్లో ‘జెంటిల్‌మెన్‌’ పేరు రోహిత్‌ శర్మకు సరిగ్గా సరిపోతుందన్న నాని.. విరాట్‌ కోహ్లీని ‘గ్యాంగ్‌ లీడర్‌’తో పోల్చాడు. ఇక పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ‘పిల్ల జమిందార్‌’ అని వ్యాఖ్యానించాడు. సునీల్‌ గవాస్కర్‌, అరోన్‌ ఫించ్‌, ఎమ్మెస్కే ప్రసాద్‌తో నాని ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని నాని వెల్లడించాడు. ఒకప్పుడు సచిన్‌ ఔటైతే టీవీలు ఆపేసేవాళ్లమని చెప్పాడు.

బ్యాటింగ్‌ సరిగ్గలేకే ఓడాం: రోహిత్‌ శర్మ

వ్యక్తిగత కారణాల వల్ల గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్‌తో పాటు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ స్టేడియంలో చక్కటి రికార్డు ఉండగా.. వీరిద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కోహ్లీ కాసిన్ని పరుగులు చేసినా.. రోహిత్‌ మాత్రం అప్పనంగా వికెట్‌ సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ.. ‘మా బ్యాటింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యం. స్కోరు బోర్డుపై పోరాడేందుకు తగినన్ని పరుగులు పెట్టలేకపోయాం. ఈ పిచ్‌ మీద 117 రన్స్‌ చేయడం సరైంది కాదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో అనుకున్న విధంగా ఆడలేకపోయాం. ఈ రోజు మాది కాదు. స్టార్క్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇక మిషెల్‌ పవర్‌ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన సూర్యకుమార్‌లో సత్తాలేదని కాదు. అతడేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. లక్ష్యం చిన్నది కావడంతో బౌలర్లు ఏం చేయలేకపోయారు. బ్యాటింగ్‌ యూనిట్‌ సమిష్టిగా సత్తాచాటితేనే విజయాలు వరిస్తాయి’ అని పేర్కొన్నాడు. ఇక భారత టాపార్డర్‌ లెఫ్టార్మ్‌ పేసర్లు సరిగ్గా ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు రోహిత్‌ ఒకింత అసహనంతో బదులిచ్చాడు. ‘వికెట్‌ ఏదైనా వికెటే.. అది లెఫ్టార్మ్‌ బౌలర్‌ పడగొట్టాడా, రైటార్మ్‌ పేసర్‌ తీశాడా అనేది పట్టించుకోం. ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామనేది వాస్తవం’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఇటీవలి కాలంలో నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటింగ్‌ విభాగం విఫలమవుతూ వస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ పిచ్‌లపై స్వింగ్‌ బంతులను ఆడటంలో మనవాళ్లు పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో పాకిస్థాన్‌ పేసర్లు మహమ్మద్‌ అమీర్‌, షాహీన్‌ షా అఫ్రిదీ బౌలింగ్‌లోనూ మనవాళ్లు పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rain Alert | వాతావరణ శాఖ అలర్ట్‌.. తెలంగాణలో మరో 2 రోజులు, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు

YS Jagan | టీడీపీ, జనసేన పొత్తులపై ఏపీ సీఎం జగన్‌ ఇండైరెక్ట్‌గా పంచులు.. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు !

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version