Home Latest News India vs Srilanka | తొలి టీ20లో శ్రీలంక విజయలక్ష్యం 163 పరుగులు.. దూకుడుగా ఆడిన...

India vs Srilanka | తొలి టీ20లో శ్రీలంక విజయలక్ష్యం 163 పరుగులు.. దూకుడుగా ఆడిన హుడా, అక్షర్‌

India vs Srilanka | శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి భారత్‌ 162 పరుగులు చేసింది. దీపక్‌ హుడా ( 40 పరుగులు ) , అక్షర్‌ పటేల్ ( 31 పరుగులు) దూకుడుగా ఆడటంతో భారీ స్కోరు చేయగలిగింది. అంతకుముందు ఇషాన్‌ కిషన్‌ , హార్దిక్‌ పాండ్య మినహా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది.

మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్లుగా బరిలో దిగారు. అయితే తొలి టీ20 ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ 7 పరుగులకే పెవీలియన్‌ చేరాడు. గిల్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ కూడా భారీ షాట్‌కు యత్నించి 7 పరుగులకే ఔటయ్యాడు. మొత్తం మీద పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేయగలిగింది.

అయితే ఏడో ఓవర్లో సంజూ శాంసన్‌ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధనంజయ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో హార్దిక్‌ , హుడా పరుగులు తీయడంలో ఇబ్బందులు పడ్డారు. చివరల్లో దీపక్‌ హుడా, అక్షర్ పటేల్‌ దూకుడుగా ఆడి శ్రీలంక ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచగలిగారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Team India Schedule | కొత్త ఏడాది అయినా టీమిండియాకు కలిసొచ్చేనా? 2023 షెడ్యూల్ ఇదే

Rishab pant health update | పంత్‌ కోలుకునేందుకు ఆరు నెలలు పట్టొచ్చు.. టీమిండియా క్రికెటర్‌ హెల్త్‌పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన వైద్యులు

Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

Exit mobile version