Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowEyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Eyes Twitching | హిందూ సంప్రదాయం ప్రకారం కొన్నింటిని మనం నమ్ముతుంటాం. వాటిలో కొన్నింటిని శుభ శకునాలని.. మరికొన్నింటిని అపశకునాలు అని అంటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి కన్ను అదరడం. అదే పనిగా కన్ను అదరితే ఇంట్లో ఏదో కీడు జరుగుతోందని కొంతమంది భయపెట్టిస్తుంటే.. అలాంటిదేమీ లేదని అదృష్టం కలిసొస్తుందని చెబుతుంటారు. ఇంతకీ కన్ను అదరడం వల్ల లాభం ఉందా? నష్టం ఉందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఒకసారి తెలుసుకుందాం..

భారతీయ సంప్రదాయాల ప్రకారం కుడి కన్ను అదిరితే ఒక అర్థం. ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయి. ఎలా అంటే ముఖ్యంగా మగవారికి కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని.. అదే ఆడవారికి అయితే ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం అదృష్టాన్ని తెస్తుందని పరిగణిస్తారు. మహిళలకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని, ఊహించని అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.అదే స్త్రీలకు కుడి కన్ను కొట్టుకోవడం మంచిది కాదని సూచించబడింది. ఒకవేళ స్త్రీలకు కుడి కన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని, దురదృష్టమని చెప్పడం జరుగుతుంది. మహిళలకు కుడి కన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెబుతున్నారు. ఈ శకునం మహిళలకి అష్ట దరిద్రాలు తెచ్చి పెడుతుంది. పురుషుల విషయంలో ఇది వ్యతిరేకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

పురుషులకు కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని చెబుతారు. సంపద వస్తుందని చెప్పటానికి సూచనగా దీనిని పరిగణిస్తారు. అదే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టం రాబోతుందనడానికి సూచన అని పేర్కొన్నారు. ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిందని చెబుతున్నారు.

కన్ను అదరడం విషయంలో భారతీయ సంప్రదాయాలకు చైనా సంప్రదాయాలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. వారు మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడి కన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు.

చైనా నేత్ర శాస్త్రం ప్రకారం.. ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడి కన్ను అయితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేది ఏదో జరుగుతుంది. కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తారు.

మధ్యాహ్నం 1-3 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది.

అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే మీరు త్వరలో కొంత ధనం కోల్పోతారు. కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఏదైతేనేం.. కన్నుశాస్త్రం ప్రకారం ఎక్కువ సేవు అలా కళ్లు అదురుతుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందట.

కానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్లే కాకుండా, నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్నా అలా కళ్లు అదురుతాయట. కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్లు అలా అదురుతుంటే కంటి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News