Home Latest News World Health Organization | ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ...

World Health Organization | ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ఆదేశాలు

Image Source: world health organization Facebook

World Health Organization | ఉజ్జెకిస్థాన్‌లో 19 చిన్నారుల మృతికి కారణమైన దగ్గుమందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందుల్లో పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వీటిని ఉజ్జెకిస్థాన్‌లోని చిన్నారులకు వాడకూడదని ఆదేశించింది.

నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ అబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్ అనే రెండు దగ్గు మందులను తయారు చేసింది. డాక్ 1 మ్యాక్స్ అనే సిరప్ తాగడం వల్లే ఉజ్జెకిస్థాన్‌లోని 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించింది. ఈ సిరప్ తాగిన 21 మంది పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యారని, వారిలో 19 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వైద్యుల సలహాలు తీసుకోకుండానే మోతాదుకు మించి ఈ సిరప్ తాగినట్లు తెలుస్తోంది.

అబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్ దగ్గు మందులను పరీక్షించగా పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరియన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకంగా ఉన్నాయని తెలిపింది. నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో ఈ రెండు దగ్గు మందులు విఫలమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలో పేర్కొంది. మరియన్ బయోటెక్ సంస్థ 2012లో ఉజ్జెకిస్థాన్‌లో రిజిస్టర్ చేపించింది. అప్పటి నుంచి అక్కడ దగ్గు మందుల విక్రయాలు జరుపుతోంది. కాగా, గాంబియా దేశంలోనూ గతంలో హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గుమందు సిరప్ తాగి 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

AP Movie Tickets | వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Exit mobile version