Home Entertainment Titanic Rerelease | 25 ఏళ్ల క్లాసిక్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తుంది.. రీరిలీజ్ కు ముస్తాబవుతున్న...

Titanic Rerelease | 25 ఏళ్ల క్లాసిక్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తుంది.. రీరిలీజ్ కు ముస్తాబవుతున్న టైటానిక్

Titanic Rerelease | కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ కొత్తగా చూస్తున్నట్టే ఫీలై పోతుంటాం. అలాంటి ఎవర్‌గ్రీన్‌ క్లాసికల్‌ మూవీస్‌లో టైటానిక్ ఒకటి. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత గొప్ప క్లాసిక్‌గా టైటానిక్ సినిమాను చెప్పుకుంటుంటారు. విషాదభరితమైన ప్రేమ కథను కూడా చాలా అందంగా గొప్పగా తీర్చిదిద్దవచ్చని జేమ్స్‌ కామెరూన్‌ నిరూపించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ క్యారెక్టర్లలో ఉండిపోతాం. ఇప్పటికీ ఈ సినిమా టెలికాస్ట్ అవుతుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన లియోనార్డో డికాప్రియో, కేన్ విన్‌స్లెట్‌ కెమిస్ట్రీ అప్పట్లో ఒక సెన్సేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌లో యాక్టింగ్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ముఖ్యంగా కేన్ తన అందం, నటనతో కుర్రకారు మతి పోగొట్టింది. ఈ ఒక్క సినిమాతో డికాప్రియో, కెన్‌ విన్‌స్లెట్‌ ఇద్దరికీ ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. ఈ అద్భుత దృశ్య కావ్యం వచ్చి పాతికేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా టైటానిక్‌ సినిమాను రీరిలీజ్‌ చేయాలని మేకర్స్‌ చూస్తున్నారు.

Titanic Rerelease
Titanic Rerelease

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 10న టైటానిక్ సినిమాను 4కే వెర్షన్‌లో భారీగా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ టైమ్ లెస్ క్లాసికల్ లవ్ స్టోరీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు కూడా తీవ్ర ఆసక్తితో ఉన్నారు. మరి అప్పటి మేజిక్ ఇప్పుడు క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.

1997లో విడుదలైన ఈ ఎపిక్ లవ్ స్టోరీ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. అప్పట్లోనే 14వేల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి అఖండ విజయం సాధించింది. బిలియన్ డాలర్ మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాతో తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు.

తెలుగునాట కూడా డిస్ట్రిబ్యూటర్లకు టైటానిక్‌ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ అందమైన ప్రేమ కథను బిగ్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు తండోపతండాలుగా తరలి వచ్చారు. నమ్మశక్యం కానీ రీతిలో కలెక్షన్లు సాధించి.. ఆ టైమ్‌లో రిలీజైన తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు సైతం గట్టి పోటీనిచ్చింది. కలెక్షన్ల పరంగానే కాదూ అవార్డుల పరంగా ఈ సినిమా ఒక సంచలనం. అప్పట్లో ఈ మూవీ 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

AP Movie Tickets | వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్.. ప్రేక్షకులకు షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Exit mobile version