Home Entertainment Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్...

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Image Source : Twitter

Natu Natu | ఆర్‌ఆర్ఆర్‌ ( RRR ) సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. రెండో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్ ( Golden Globe ) అవార్డు రావడంతో చిత్ర బృందంతో పాటు అటు మెగా ఫ్యాన్స్‌, నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులు చిత్ర బృందాన్ని అభినందనలు, శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడుతున్నారు. కానీ నాటు నాటు పాట కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఈ పాటలో పర్‌ఫెక్షన్‌ కోసం దర్శకుడు రాజమౌళి ( Rajamouli ) తమను మామూలుగా హింస పెట్టలేదని సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ( Junior NTR ) , చరణ్‌ ( Ramcharan ) ఇద్దరూ చెప్పారు కూడా. అంతేకాకుండా ఈ పాట వెనుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తాజాగా చిత్ర బృందం బయటపెట్టింది.

అసలు నాటు నాటు పాటను ఉక్రెయిన్‌ దేశంలో చిత్రీకరించినట్లు తాజాగా చిత్ర బృందం తెలిపారు. అది కూడా ఆ దేశ అధ్యక్ష భవనం ముందు. దాని పేరు మరియిన్‌ స్కీ ప్యాలెస్‌. 2021 ఆగస్టులో నాటు నాటు సాంగ్‌ షూట్‌ చేశారు. అప్పటికీ ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కాలేదు. పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. అయినప్పటికీ అధ్యక్ష భవనం ముందు షూటింగ్‌ కోసం పర్మిషన్‌ ఇవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. కానీ ఉక్రెయిన్‌ ( Ukrain ) అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ( Zelensky ) మాత్రం ఎలాంటి కండీషన్స్‌ లేకుండా అనుమతులు ఇచ్చాడు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు టీవీ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఒక కామెడీ టీవీ షోలో దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే రాజకీయాల్లోకి వచ్చి నిజంగానే ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు అయ్యాడు. దీంతో సినిమాల మీద తనకు ఉన్న మక్కువతో ఆర్ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌కు ఈజీగానే అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ సమయంలో ఉక్రెయిన్‌లో పరిణామాలపై తమకు అవగాహన లేదని.. యుద్ధం సమయంలోనే అక్కడి పరిస్థితుల గురించి తెలిశాయని తెలిపాడు.

ఇక నాటు నాటు సాంగ్‌ విషయానికొస్తే ప్రేమ్‌ రక్షిత్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పులన్నీ కూడా అభిమానులకు బాగా నచ్చుతాయి. ఆడియన్స్‌ కూడా ఇప్పటికీ ఈ పాట వినిపిస్తే కచ్చితంగా కాళ్లు కదుపుతారు కూడా. అంత ఫేమస్‌ అయిన ఈ పాటలోని స్టెప్పులను డ్యాన్స్ మాస్టర్ చేసిన దానికంటే కూడా చరణ్‌, తారక్‌ లే బాగా చేశారు.

సామాన్యంగా చరణ్‌, తారక్‌ ఏ సీన్ అయినా ఒకే టేక్‌ లో చేసేస్తారు. డ్యాన్స్‌కి కూడా పెద్దగా ప్రాక్టీస్‌ అక్కర్లేదు. అలాంటి వారిద్దరికి నాటునాటు పాట పరీక్ష పెట్టిందనే చెప్పవచ్చు. ఈ పాటలో 80కి పైగా వేరియేషన్‌ స్టెప్‌ లను ప్రేమ్‌ రక్షిత్‌ కంపోజ్‌ చేశారు. వీటిని చేసేందుకు హీరోలిద్దరూ కూడా 18 కి పైగా టేకులు తీసుకున్నారు. ఇన్ని టేకులు చేసినప్పటికీ దర్శకుడు మాత్రం రెండో టేకును ఓకే చేశారు.

ఈ పాటను చంద్రబోస్‌ రాయగా రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ లిస్ట్‌లో కూడా ఉత్తమ పాట విభాగంలో చోటు సాధించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Exit mobile version